విఠలాచార్య సినిమాల్లోలా..! నడుస్తాను..రివ్వున ఎగురుతాను! | Leonardo Walking Robot That Can Fly, Slackline | Sakshi
Sakshi News home page

విఠలాచార్య సినిమాల్లోలా..! నడుస్తాను..రివ్వున ఎగురుతాను!

Mar 20 2022 1:47 PM | Updated on Mar 20 2022 1:47 PM

Leonardo Walking Robot That Can Fly, Slackline - Sakshi

ఫొటో కనిపిస్తున్నది విఠలాచార్య సినిమాల్లోని కంకాళంలా ఉంది కదూ! ఇది కంకాళం కాదు, మోడర్న్‌ గరుడావతారం. అమెరికాలోని కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (కాల్‌టెక్‌) శాస్త్రవేత్తలు ‘లియోనార్డో’ పేరిట రూపొందించిన రోబో ఇది. 

దీనిలోని ప్రత్యేకత ఏమిటంటే, ఇది మనిషిలా నేల మీద రెండుకాళ్లతో నడవగలదు. డేగలా ఆకాశంలో రివ్వున ఎగరగలదు. ఒకరకంగా ఇది రోబో ద్రోన్‌. ఎంత ఎత్తు ఎగిరినా, భూమ్మీద ఎలాంటి ఉపరితలంపైన అయినా ఇట్టే వాలగలిగేలా దీన్ని తీర్చిదిద్దారు. 

అంగారకుని ఉపరితలంపై కూడా వాలేందుకు అనువుగా దీనికి మరిన్ని మెరుగులు దిద్దుతున్నట్లు ‘కాల్‌టెక్‌’ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement