కొత్త అప్‌డేట్‌తో కేటీఎమ్ 390 డ్యూక్: రేటు మాత్రం సేమ్ | KTM 390 Duke With Cruise Control Launched | Sakshi
Sakshi News home page

కొత్త అప్‌డేట్‌తో కేటీఎమ్ 390 డ్యూక్: రేటు మాత్రం సేమ్

Mar 16 2025 9:03 PM | Updated on Mar 16 2025 9:03 PM

KTM 390 Duke With Cruise Control Launched

కేటీఎమ్ కంపెనీ తన 390 డ్యూక్ 2025 బైకును అప్డేట్ చేసింది. ఇప్పుడు ఇందులో క్రూయిజ్ కంట్రోల్ మాత్రమే కాకుండా.. ఇది కొత్త కలర్ ఆప్షన్‌తో లభిస్తుంది. దీని ధర రూ. 2.95 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్ కలిగి ఉండటం వల్ల కేటీఎమ్ 390 డ్యూక్ మరింత టూరింగ్-ఫ్రెండ్లీగా మారుతుంది. ఈ బైక్ చిన్న అప్డేట్స్ పొందినప్పటికీ ధరలో మాత్రం ఎలాంటి అప్డేట్ లేదు. ఇప్పటికే ఈ బైక్ డీలర్‌షిప్‌లలో కనిపించింది. అంటే అమ్మకానికి వచ్చేసిందన్నమాట.

ఈ బైక్ చూడటానికి.. దాని మునుపటి బైకుల కంటే కొంత భిన్నమైన పెయింట్ స్కీమ్ పొందుతుంది. కాబట్టి ఇది నలుపు రంగులో ఉండటం చూడవచ్చు. కాగా ఇప్పటికే ఈ మోడల్ నారింజ, నీలం రంగులలో ఉంది.

ఇంజిన్, పర్ఫామెన్స్ వంటి వాటిలో కూడా ఎటువంటి మార్పు లేదు. కాబట్టి ఇందులో 399 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఈ ఇంజిన్ 45.3 Bhp పవర్, 39 Nm టార్క్ అందిస్తుంది. పనితీరులో స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే ఉంటుంది.

Advertisement
 
Advertisement
Advertisement