సెరెంటికాలో కేకేఆర్‌ పెట్టుబడి

Kkr Investments Of 400 Million Dollars In Serentica Renewables - Sakshi

ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీ కేకేఆర్‌ తాజాగా పునరుత్పాదక ఇంధన రంగంలో ఉన్న సెరెంటికా రెనివేబుల్స్‌లో రూ.3,280 కోట్ల పెట్టుబడి చేస్తోంది. మూడు దీర్ఘకాలిక విద్యుత్‌ పంపిణీ ఒప్పందాలను చేసుకున్న సెరెంటికా ప్రస్తుతం 1,500 మెగావాట్ల సౌర, పవన విద్యుత్‌ ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తోంది. కర్నాటక, రాజస్తాన్, మహారాష్ట్రలో ఇవి నెలకొన్నాయి. మధ్యకాలిక లక్ష్యంలో భాగంగా 5,000 మెగావాట్ల ప్రాజెక్టులను అందుబాటులోకి తేవాలని కంపెనీ భావిస్తోంది.

ఏటా 1,600 కోట్ల యూనిట్ల స్వచ్చ విద్యుత్‌ను అందించాలని కృతనిశ్చయంతో ఉంది. స్టెర్లైట్‌ పవర్‌ ట్రాన్స్‌మిషన్, స్టెర్లైట్‌ టెక్నాలజీస్‌లో మెజారిటీ వాటా కలిగిన ట్విన్‌స్టర్‌ ఓవర్సీస్‌ అనుబంధ కంపెనీయే సెరెంటికా.

చదవండి: ఏం జరుగుతోంది, ఊడిపోతున్న ఉద్యోగాలు.. ఫేస్‌బుక్‌లో 11వేల మందిపై వేటు!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top