
ప్రారంభ ధర రూ. 17.99 లక్షలు
న్యూఢిల్లీ: వాహనాల తయారీ సంస్థ కియా ఇండియా, దేశీయంగా తయారు చేసిన తొలి ఎలక్ట్రిక్ వాహనం క్యారెన్స్ క్లావిస్ ఈవీని ఆవిష్కరించింది. ఇది 404 కి.మీ., 490 కి.మీ. రేంజిని ఇచ్చేలా రెండు బ్యాటరీ ఆప్షన్లలో లభిస్తుంది. ధరలు రూ. 17.99 లక్షల నుంచి రూ. 24.49 లక్షలుగా ఉంటుంది.
ఫాస్ట్ చార్జర్‌తో 39 నిమిషాల్లోనే 10 నుంచి 80 శాతం వరకు చార్జింగ్ అవుతుందని కియా ఇండియా ఎండీ గ్వాంగూ లీ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపూర్‌లోని ప్లాంటులో కియా ఈ కార్లను ఉత్పత్తి చేస్తుంది. కంపెనీ ప్రస్తుతం ఈవీ6, ఈవీ9 పేరిట రెండు ఎలక్ట్రిక్ వాహనాలను దిగుమతి చేసుకుని, విక్రయిస్తోంది.