ఆశావహంగా ట్రాక్టర్ల మార్కెట్‌ | John Deere India expects tractor market to remain good | Sakshi
Sakshi News home page

ఆశావహంగా ట్రాక్టర్ల మార్కెట్‌

Feb 23 2023 6:18 AM | Updated on Feb 23 2023 6:18 AM

John Deere India expects tractor market to remain good - Sakshi

ముంబై: వ్యవసాయంలో ట్రాక్టర్ల వినియోగం పెరిగేలా సానుకూల పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రాబోయే రోజుల్లోనూ పరిశ్రమ పనితీరు ఆశావహంగా ఉండగలదని జాన్‌ డీర్‌ ఇండియా ఎండీ సాహిలేంద్ర జగ్‌తప్‌ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ స్థాయిలో ట్రాక్టర్ల అమ్మకాలు 9,00,000 యూనిట్ల పైచిలుకు ఉండవచ్చని ఆయన చెప్పారు.

వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ దాదాపు ఇదే స్థాయి కొనసాగవచ్చని అంచనా వేస్తున్నట్లు వివరించారు. 1998లో భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించిన జాన్‌ డీర్‌కు ప్రస్తుతం మహారాష్ట్రలోని పుణెలోను, మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌లోనూ చెరో ప్లాంటు ఉంది. వీటి వార్షిక ఉత్పత్తి సామర్ధ్యం 1.32 లక్షల ట్రాక్టర్లుగా ఉంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement