లగ్జరీ బైక్‌తో ‘పఠాన్‌’ స్టార్ హల్‌చల్‌: వీడియో వైరల్

John abraham buys 2023 suzuki hayabusa video viral - Sakshi

సాక్షి, ముంబై: సాధారణ ప్రజలకంటే కూడా సెలబ్రిటీలకు లగ్జరీ కార్లు, బైకులపైన ఎక్కువ క్రేజు ఉంటుంది. ఇందులో భాగంగానే ఇటీవల బాలీవుడ్ స్టార్ 'జాన్ అబ్రహం' ఒక ఖరీదైన సుజుకి హయబుసా బైక్ కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

'పఠాన్' సినిమా అతి తక్కువ కాలంలోనే గొప్ప విజయం సాధించిన తరువాత 'జాన్ అబ్రహం' ఈ సరికొత్త 2023 మోడల్ హయబుసా కొనుగోలు చేశారు. ఈ మోడల్ ఇంకా భారతీయ మార్కెట్లో విడుదల కాలేదు. ధూమ్ సినిమాలో హయబుసా రైడ్ చేసి ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచిన జాన్ ఇప్పుడు లేటెస్ట్ హుయాబుసా సొంతం చేసుకున్నాడు.

ఈ 2023 హయబుసా బైకుని CBU (కంప్లీట్ బిల్డ్ యూనిట్) మార్గం ద్వారా మన దేశానికి దిగుమతి చేసుకోవాలి. ఈ బైక్ 1,340cc ఇన్ లైన్ ఫోర్ సిలిండర్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజిన్ 187.4 బిహెచ్‌పి పవర్ మరియు 142 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా ఈ బైక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

జాన్ అబ్రహం ఇప్పటికే తన గ్యారేజిలో యమహా వి-మ్యాక్స్, డుకాటి పానిగేల్, MV అగస్టా, కెటిఎమ్ 390, బిఎండబ్ల్యు ఎస్1000ఆర్ఆర్, అప్రిలియా RSV4 RF వంటి బైకుయ్లను కూడా కలిగి ఉన్నారు. అయితే ఇప్పుడు హయబుసా కొత్త అతిధిగా తన గ్యారేజిలో అడుగుపెట్టింది. నిజానికి జాన్ అబ్రహం కాలిఫోర్నియా సూపర్ బైక్ స్కూల్ నుంచి ప్రత్యేక రైడింగ్ శిక్షణ పొందాడు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top