JioMeet : ఆన్‌లైన్‌ క్లాసుల కోసం జియోమీట్‌.. ఇప్పుడు ప్రాంతీయ భాషల్లో

JioMeet Now Support Regional Language - Sakshi

వీడియో కాలింగ్‌ విభాగంలో సరికొత్త ఫీచర్‌కి అదనపు హంగులు జోడించింది జియోమీట్‌. భారతీయుల అవసరాలకు తగ్గట్టుగా స్థానిక భాషల్లో ఈ యాప్‌ని ఉపయోగించే విధంగా మార్పులు చేసింది. 

జియోమీట్‌ అంటే
కరోనా సంక్షోభం తర్వాత జీవన శైలిలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఆఫీసు పనులు, అకాడమిక్‌ వ్యవహరాలు అన్నీ వర్చువల్‌ పద్దతిలోనే ఎక్కువగా జరుగుతున్నాయి. దీంతో జూమ్‌, గూగుల్‌ మీట్‌ వంటి వీడియో కాలింగ్‌ యాప్స్‌ అవసరం పెరిగిపోయింది. దీంతో మారిన పరిస్థితులకు తగ్గట్టుగా జియోమీట్‌ అనే యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది జియో నెట్‌వర్క్‌.

స్థానిక భాషల్లో
పల్లె, పట్నం తేడా లేకుండా జియో నెట్‌వర్క్‌ దేశమంతటా విస్తరించింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో జియోమీట్‌ ఉపయోగిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. అయితే వీరికి మరింత అనువుగా ఉండేలా ఇంగ్లిష్‌తో పాటు స్థానిక భాషల్లో జియోమీట్‌ను ఉపయోగించుకునేలా  మార్పులు చేశారు. ఆగస్టు 15 నుంచి హింది, మరాఠి, గుజరాత్‌ భాషలను ఈ యాప్‌లో అందుబాటులోకి తెచ్చింది. అతి త్వరలోనే తెలుగు, తమిళ, కన్నడ భాషలను కూడా యాడ్‌ చేస్తామని జియో సంస్థ తెలిపింది.

డేటా సేవర్‌
సాధారణంగా కాన్ఫరెన్స్‌లు , ఆన్‌లైన్‌ క్లాసులు గంటల తరబడి జరుగుతుంటాయి. దీని వల్ల డేటా వాడకం ఎక్కువ అవుతుంది. తమ వీడియో కాలింగ్‌ యాప్‌లో డేటా యూసేజీ తక్కువగా ఉంటుందని జియో అంటోంది. తక్కువ డేటా ఉపయోగిస్తూ హై డెఫినేషన్‌లో ఎక్కువ సేపు ఆన్‌లైన్‌ క్లాసులు, వర్చువల్‌ సమావేశాల్లో పాల్గొనవచ్చని హామీ ఇస్తోంది. 
 

చదవండి : Apple Days Sale: ఆపిల్‌ ఉత్పత్తులపై భారీ ఆఫర్లు, క్యాష్‌ బ్యాక్‌..!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top