కాసులు కురిపించిన షేర్లు.. కుబేరుల్లో రెండో స్థానానికి జెఫ్ బెజోస్ | Jeff Bezos sells 3 billion usd Amazon shares ranks second richest | Sakshi
Sakshi News home page

కాసులు కురిపించిన షేర్లు.. కుబేరుల్లో రెండో స్థానానికి జెఫ్ బెజోస్

Nov 3 2024 1:54 PM | Updated on Nov 3 2024 3:12 PM

Jeff Bezos sells 3 billion usd Amazon shares ranks second richest

అమెజాన్  ఫౌండర్‌ జెఫ్ బెజోస్‌కు షేర్లు కాసులు కురిపించాయి. ప్రపంచ కుబేరుల్లో రెండో స్థానానికి చేర్చాయి. 3 బిలియన్ డాలర్లు (రూ.25 వేల కోట్లు) విలువైన అమెజాన్ షేర్లను బెజోస్‌ ఇటీవల విక్రయించారు. దీంతో ఈ సంవత్సరానికి ఆయన మొత్తం స్టాక్ అమ్మకాలు 13 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయి.

రెగ్యులేటరీ ఫైలింగ్ ప్రకారం.. బెజోస్ 1.6 కోట్లకు పైగా షేర్లను విక్రయించారు. ఇటీవల భారీగా పెరిగిన అమెజాన్ స్టాక్ ధరను ఆయన సద్వినియోగం చేసుకున్నారు. ఒక్కో షేరు ధర 200 డాలర్లను తాకింది. అమెజాన్ స్టాక్ గత సంవత్సరంలో 40 శాతానికి పైగా పెరిగింది. ఇటీవల ప్రకటించిన మూడవ త్రైమాసిక ఫలితాలు అంచనాలను మించి రాణించడంతో గత వారం రోజుల్లోనే షేర్ల విలువ 7 శాతం పెరిగింది.

ఇదీ చదవండి: చనిపోయినా.. చచ్చేంత సంపాదన

అమెజాన్‌ స్టాక్‌ల విలువ పెరగడంతో బెజోస్ సంపద కూడా పెరిగింది. ఇది గత సంవత్సరంలో 42.8 బిలియన్‌ డాలర్లు పెరిగింది. ఈ నవంబర్ 3 నాటికి, బెజోస్‌ 220 బిలియన్‌ డాలర్ల నెట్‌వర్త్‌తో బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో రెండవ స్థానంలో ఉన్నారు. టెస్లా అధిపతి ఎలాన్ మస్క్ 262 బిలియన్‌ డాలర్లతో మొదటి స్థానంలో ఉండగా, మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ 201 బిలియన్‌ డాలర్లతో మూడవ స్థానంలో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement