ప్రధానితో చర్చించిన అంశాలను పంచుకున్న బిల్‌గేట్స్‌ | Sakshi
Sakshi News home page

ప్రధానితో చర్చించిన అంశాలను పంచుకున్న బిల్‌గేట్స్‌

Published Fri, Mar 1 2024 1:00 PM

It Is Always Inspiring Bill Gates Said About Meet After PM Modi - Sakshi

మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ 25 ఏళ్ల తర్వాత ఇటీవల హైదరాబాద్‌ వచ్చిన సంగతి తెలిసిందే. భారత పర్యటనలో భాగంగా ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో గురువారం సమావేశమయ్యారు. వ్యవసాయం, ఆరోగ్య రంగంలో ఆవిష్కరణలు, మహిళల అభివృద్ధి వంటి అంశాల్లో కృత్రిమ మేధ వినియోగం గురించి మాట్లాడుకున్నారు.

ప్రధాని మోదీని ఆయన విదేశాల్లో చాలాసార్తు కలిశారని తెలిపారు. మోదీని కలవడం ఎప్పుడూ స్ఫూర్తిదాయకంగా ఉంటుందన్నారు. ప్రజా ప్రయోజనాల కోసం ఏఐ అవసరాల గురించి మాట్లాడామన్నారు. వ్యవసాయం, ఆరోగ్యం, వాతావరణ అంశాల్లో ఆవిష్కరణలు సహా భారత్‌ నుంచి ఎలాంటి అంశాలను ప్రపంచస్థాయికి తీసుకెళ్లాలో చర్చించామని బిల్‌ గేట్స్‌ తన ‘ఎక్స్‌’ ఖాతాలో చెప్పారు. గేట్స్‌ పోస్టుకు మోదీ స్పందించారు. నిజంగా అదో అద్భుత సమావేశమన్నారు. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది గతిని మార్చే రంగాల గురించి చర్చించడం ఎప్పుడూ ఆనందంగా ఉంటుందన్నారు.

ఇదీ చదవండి: ఇకపై యాపిల్‌ కార్ల తయారీ లేనట్టేనా..?

సరిగ్గా 25 ఏళ్ల క్రితం 1998లో తాను ప్రారంభించిన హైదరాబాద్‌లోని మైక్రోసాఫ్ట్‌ ఇండియా డెవలప్‌మెంట్‌ సెంటర్‌(ఐడీసీ)ని సంస్థ అధినేత బిల్‌ గేట్స్‌ ఇటీవల సందర్శించారు. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌లో ఐడీసీ కీలక పాత్ర పోషిస్తోంది. అజూర్‌, విండోస్‌, ఆఫీస్‌, బింగ్‌, కోపిలాట్‌, ఇతర ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ) టూల్స్‌ అభివృద్ధి వెనుక ఐడీసీ కీ రోల్‌ ప్లే చేసింది. 

Advertisement
 

తప్పక చదవండి

Advertisement