రైల్వే ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త.. ఆ ప్రయాణికులకు ఉచిత ఆహారం!

Irctc: Indian Railways Providing Free Of Cost To These Train Passengers - Sakshi

భారతీయ రైల్వే.. రోజూ కొన్ని లక్షల మంది ప్రయాణికులను వారి గమ్యస్థానానికి చేరుస్తూ, ప్రజలకు ఎన్నో రకాల సేవలను అందిస్తోంది. ప్రయాణికులకు అందించే సర్వీస్‌ విషయంలో ఏ మాత్రం రాజీపడకుండా ముందుకు దుసుకుపోతోంది. ఎప్పటికప్పుడు కొత్త సేవలను ప్రవేశపెడుతూ ప్రయాణికుల సౌకర్యానికి పెద్ద పీట వేస్తుంది ఇండియన్‌ రైల్వేస్‌. తాజాగా ప్రయాణికుల కోసం మరో సౌకర్యాన్ని ఏర్పాటు చేసింది. ఈ సారి ఏకంగా తన ప్రయాణికులకు ఉచిత ఆహార సౌకర్యాన్ని తీసుకొచ్చింది. దీనిపై పూర్తి వివరాలు తెలుసుకుందాం!

ప్రస్తుత పండుగ సీజన్‌లో భారతీయ రైల్వే అనేక ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. దీపావళి, ఛత్ వంటి పండుగల సందర్భంగా భారతీయ రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం అనేక ప్రత్యేక రైళ్లను ప్రారంభించింది. మరో వైపు రైలులో ప్రయాణించే ప్రయాణికులకు ఉచిత ఆహార సౌకర్యాన్ని కూడా కల్పిస్తోంది. అయితే గమనించల్సిన విషయం ఏంటంటే.. రైల్వే శాఖ ఈ సదుపాయం ప్రతి రైలులోని ప్రయాణీకులకు అందుబాటులో ఉండదని తెలపింది.

కేవలం కొన్ని రైళ్లకు మాత్రమేనని.. ఆ జాబితాలో డుర్యాంటో ఎక్స్‌ప్రెస్, రాజధాని, శతాబ్ది వంటి లగ్జరీ రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులకు మాత్రమే ఈ సౌకర్యం కల్పిస్తున్నట్లు పేర్కొంది. ఉచిత ఆహార సౌకర్యం పొందాలంటే.. రైలు రెండు గంటలు లేదా అంతకంటే ఎక్కువ ఆలస్యం అయిన రైలులోని ప్రయాణికులకు మాత్రమే ఈ ఉచిత సర్వీస్‌ అందిస్తున్నారు. 

ఒక నివేదిక ప్రకారం, పై తెలిపిన వాటి ప్రకారం ప్రయాణీకులు పూర్తి భోజనం లేదా మధ్యాహ్న అల్పాహారం లేదా మధ్యాహ్న భోజనం మొదలైనవి, అలాగే కొన్ని ఎంపిక చేసిన పానీయాలు కూడా ఉచితంగా అందిస్తారు.

చదవండి: ఉద్యోగులకు ఊహించని గిఫ్ట్‌ ఇచ్చిన యజమాని.. జీవితాంతం కరెంట్‌ ఫ్రీ!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top