త్వరలో ఎలక్ట్రిక్‌  వాహనాలకు బీమా పాలసీ  | Insurance Policy Will Soon Be Introduced For Electric Vehicles As Well Said Rakesh Kaul | Sakshi
Sakshi News home page

త్వరలో ఎలక్ట్రిక్‌  వాహనాలకు బీమా పాలసీ 

Published Sat, Feb 18 2023 9:11 AM | Last Updated on Sat, Feb 18 2023 9:11 AM

Insurance Policy Will Soon Be Introduced For Electric Vehicles As Well Said Rakesh Kaul - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఎలక్ట్రిక్‌ వాహనాల కోసం కూడా త్వరలోనే బీమా పాలసీని ప్రవేశపెట్టనున్నట్లు జునో జనరల్‌ ఇన్సూరెన్స్‌ (గతంలో ఎడెల్వీస్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌) సీడీవో రాకేశ్‌ కౌల్‌ తెలిపారు. ప్రస్తుతం రోడ్‌ సైడ్‌ అసిస్టెన్స్‌ వంటి అంశాలకు సంబంధించి అధ్యయనం చేస్తున్నట్లు ఆయన వివరించారు.

త్వరలో మరికొన్ని హెల్త్‌ పాలసీలను కూడా ప్రవేశపెడుతున్నట్లు కౌల్‌ పేర్కొన్నారు.  తమ వ్యాపారంలో దాదాపు 35 శాతం వాటా దక్షిణాది రాష్ట్రాల నుంచి ఉంటోందని ఆయన పేర్కొన్నారు. 30 లక్షల పైగా కస్టమర్లు, 1,000 పైచిలుకు కార్పొరేట్‌ క్లయింట్లు ఉన్నట్లు కౌల్‌ తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement