
న్యూఢిల్లీ: సీఎస్‌సీ ఈ గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియా, ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ సహకార ఒప్పందానికి వచ్చాయి. 10–22 ఏళ్ల వయసు విద్యార్థులకు ‘ఇన్ఫోసిస్ స్ప్రింగ్‌బోర్డ్’ ప్లాట్‌ఫామ్ ద్వారా డిజిటల్ నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వనున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాల్లోని విద్యార్థులకు వొకేషషణల్ శిక్షణ ఇవ్వనున్నట్టు ప్రకటించాయి.
కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ పరిధిలోని సంస్థే సీఎస్‌సీ ఈ గవర్నెన్స్. ప్రధానమంత్రి గ్రామీణ్ డిజిటల్ సాక్షరత అభియాన్ పథకం కింద 6 కోట్ల గ్రామీణులకు డిజిటల్ నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వడమే తమ ధ్యేయమని సీఎస్‌సీ ఈ గవర్నెన్స్ ఇండియా ఎండీ దినేష్ కే త్యాగి తెలిపారు.