భారత్‌–కొరియా ద్వైపాక్షిక వాణిజ్యం పటిష్టం

Indo-Korea Bilateral Trade Grows 17percent To Record 27. 8 Billon In 2022 - Sakshi

న్యూఢిల్లీ: భారత్‌–కొరియా ద్వైపాక్షిక వాణిజ్యం 2022లో 17 శాతం పెరిగి 27.8 బిలియన్‌ డాలర్లకు ఎగసింది. 2021లో ఈ విలువ 23.7 బిలియన్‌ డాలర్లని కొరియా– ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ ఏజెన్సీ (కేఓటీఆర్‌ఏ) పేర్కొంది. భారత్‌కు కొరియా ఎగుమతులు 2022లో 21% పెరిగి 18.9 బిలియన్‌ డాలర్లకు పెరిగింది.

దిగుమతు లు 10.5% ఎగసి 8.9 బిలియన్‌ డాలర్లకు చేరాయి.  2023 భారత్‌–కొరియా ఇండస్ట్రీ భాగస్వామ్య కార్యక్రమంలో దేశంలో కొరియా రిపబ్లి క్‌ రాయబారి చాంగ్‌ జియో–బుక్‌ ఈ విషయాల ను తెలిపారు. గ్రీన్‌ ఎనర్జీ, హైడ్రోజన్‌ ఎనర్జీ, ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ రంగాల్లో ఇరుదేశాలు పరస్ప రం సహకరించుకుంటున్నట్లు వెల్లడించారు.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top