ఏవియేషన్‌ చరిత్రలో అదిపెద్ద డీల్‌.. 500 విమానాలకు ఇండిగో ఆర్డర్‌

Indigo Buys 500 Planes From Airbus - Sakshi

ఏవియేషన్‌ చరిత్రలో అతి పెద్ద డీల్‌ జరిగింది. దేశీయ ఏయిర్‌లైన్స్‌ దిగ్గజం ఇండిగో ఫ్రాన్స్‌ విమానాల తయారీ సంస్థ ఎయిర్‌బస్‌ నుంచి 500 విమానాల్ని కొనుగోలు చేసేలా ఒప్పందం కుదర్చుకుంది.  

ఇప్పటికే టాటాలకు చెందిన ఎయిరిండియా ఎయిర్‌బస్‌, బోయింగ్‌ నుంచి 470 విమానాల కొనుగోలుకు ఆర్డర్‌ పెట్టింది. ఆ ఒప్పందం కంటే ఇండిగో - ఎయిర్‌ బస్‌ల మధ్య జరిగిన డీల్‌ దేశీయ విమాన చరిత్రలో ఇదే పెద్దదని పరిశ్రమ వర్గాల విశ్లేషకులు చెబుతున్నారు. 

జూన్‌ 19న ప్యారిస్‌ ఎయిర్‌ షోలో ఇండిగో - ఎయిర్‌బస్‌ల మధ్య కొనుగోలు చర్చలు జరిగాయి. ఈచర్చల్లో సందర్భంగా ఇండిగో బోర్డ్‌ఆఫ్‌ చైర్మన్‌ వి.సుమత్రాన్‌, ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్, ఎయిర్‌బస్‌ సీఈవో గుయిలౌమ్ ఫౌరీ, అంతర్జాతీయ చీఫ్‌ కమర్షియల్‌ అధికారి క్రిస్టియన్ షెరర్‌లు పాల్గొన్నారు.

అనంతరం, దేశ ఏవియేషన్‌ హిస్టరీలోనే భారీ కొనుగోలు ఒప్పందం జరిగింది. 500 ఏ320 ఎయిర్‌ క్రాఫ్ట్‌ల కొనుగోలుకు ఆర్డర్‌ పెట్టినట్లు ఇండిగో తెలిపింది. తాజా ఇండిగో చేసిన ఆర్డర్‌తో ఎయిర్‌బస్ డెలివరీ చేయాల్సిన విమానాల సంఖ్య 1,330కి చేరింది. కాగా, ప్రస్తుతం ఇండిగో 300 విమానాలను నడుపుతోంది. ఇది వరకే 480 విమానాలకు ఆర్డర్‌ పెట్టింది. ఇవి డెలివరీ అవ్వాల్సి ఉంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top