కొత్త ఏడాది టెక్కీలకు గుడ్‌ న్యూస్‌.. జీతాలు పెరగనున్నాయ్‌!

Indian Tech And Gaming Companies To Give Highest Salary Hike In Asia 2023 Says Survey - Sakshi

టెక్ దిగ్గ‌జాలు తమ సిబ్బందిని భారీగా ఇంటికి సాగనంపడం, పింక్ స్లిప్పుల క‌ల‌క‌లంతో ఉద్యోగుల్లో భయాందోళనల న‌డుమ వారికి వేత‌న పెంపుపై శుభవార్త వెలువడింది. భారతదేశంలో ఈ ఏడాది సగటు జీతం 10 శాతం పెరిగే అవకాశం ఉందని, ఇది గత ఏడాది కంటే కేవలం 0.4 శాతం ఎక్కువని కాన్ ఫెర్రీ తాజా వేత‌న స‌ర్వే సర్వే వెల్లడించింది. "మాంద్యం, ఆర్థిక మందగమనమంటూ ప్రపంచవ్యాప్తంగా ఈ భయాలు ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ మాత్రం ఆశాజనకంగా ఉందని కార్న్ ఫెర్రీ ఛైర్మన్, రీజినల్ మేనేజింగ్ డైరెక్టర్ నవనిత్ సింగ్ సర్వేలో పేర్కొన్నారు.

818 సంస్థలు, 8 లక్షలకు పైగా ఉద్యోగులపై జరిపిన సర్వేలో, భారతీయ కార్పొరేట్ ఉద్యోగులు 2023లో సగటున 9.8 శాతం సాలరీ పెంపు ఉండొచ్చని సర్వే పేర్కొంది.

అత్యుత్త‌మ నైపుణ్యాల‌ను క‌న‌బ‌రిచే ఉద్యోగుల‌కు ఆయా కంపెనీలు ఏకంగా 15 శాతం నుంచి 30 శాతం వ‌ర‌కూ వేత‌న పెంపు వ‌ర్తింప‌చేయ‌వ‌చ్చ‌ని తెలిపింది. ఆర్థిక సేవలు, బ్యాంకింగ్, టెక్నాలజీ, మీడియా, గేమింగ్‌తో సహా రంగాలు ఈ ఏడాది జీతాలు పెరిగే అవకాశం ఉన్నట్లు నివేదిక తెలిపింది.

ఈ పెంపు  వివిధ రంగాల పరంగా చూస్తే.. టెక్నాలజీలో 10.4 శాతం, మీడియా 10.2 శాతం, గేమింగ్ 10 శాతం. అదనంగా, కొన్ని ఇతర రంగాల జీతాల పెంపు అంచనాలలో సేవా రంగం 9.8 శాతం, ఆటోమోటివ్ 9 శాతం, రసాయనం 9.6 శాతం, వినియోగ వస్తువులు 9.8 శాతం, రిటైల్ 9 శాతం ఉన్నాయి. 

అదనంగా, పెరుగుతున్న వినియోగదారుల డిమాండ్‌లకు అనుగుణంగా చాలా వ్యాపారాలు తమ శ్రామిక శక్తిని మార్చుకోవాల్సిన అవసరం ఉందని సర్వే సూచిస్తుంది. సర్వేలో పాల్గొన్న దాదాపు 60 శాతం సంస్థలు తాము ఒక రకమైన హైబ్రిడ్ మోడల్‌ను స్వీకరించినట్లు సూచించాయి.

చదవండి: గ్యాస్‌ సిలిండర్‌ డోర్‌ డెలివరీ చేస్తే డబ్బులు ఇస్తున్నారా? కంపెనీ ఏం చెప్తోందంటే!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top