
భారత బంగారం పరిశ్రమకు సంబంధించి కొత్త అసోసియేషన్ ఏర్పాటు కానుంది. ఇండియన్ అసోసియేషన్ ఫర్ గోల్డ్ ఎక్సలెన్స్ అండ్ స్టాండర్డ్స్ (ఐఏజీఈఎస్) పేరుతో అసోసియేషన్ ఏర్పాటవుతోంది. ఈ పరిశ్రమకు స్వీయ నియంత్రణ సంస్థ (ఎస్‌ఆర్‌ఓ)గా ఇది బాధ్యతలు నిర్వహిస్తుంది. ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) ఎస్‌ఆర్‌ఓకు తగిన మద్దతు, సహాయ సహకారాలను అందిస్తుంది. ఇటు ప్రభుత్వానికి అటు వినియోగదారుకు పరిశ్రమ పట్ల విశ్వసనీయత, పారదర్వకత పెంపొందించడం లక్షంగా తాజా అసోసియేషన్ పనిచేస్తుంది.
ఈ సందర్భంగా డబ్ల్యూజీసీ ప్రాంతీయ సీఈఓ (ఇండియా) సచిన్ జైన్ మాట్లాడుతూ..‘బంగారం పరిశ్రమలో వినియోగదారులకు విశ్వసనీయతను పెంచడమే కొత్త సంఘం లక్ష్యం. ఈ ఏడాది డిసెంబరు లేదా జనవరి 2025 నాటికి ఈ సంస్థ కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉంది. ఇండియన్ బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ), ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జువెలరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (జీజేసీ) జెమ్ అండ్ జ్యువెలరీ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (జీజేఈపీసీ)సహా ఇతర జాతీయ పరిశ్రమ సంఘాలు కొత్త సంఘం ఏర్పాటులో భాగమవుతున్నాయి’ అన్నారు. అసోసియేషన్ కార్యకలాపాల ఫ్రేమ్‌వర్క్‌ను సంస్థ ఏర్పడిన తర్వాత ప్రకటిస్తారని సచిన్ చేప్పారు. సంస్థ సభ్యత్వాలను కూడా అప్పుడే నిర్ణయిస్తారని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ఊహకందని రీతిలో తగ్గిన బంగారం, వెండి ధరలు!