2020 ఇండియన్ బెస్ట్ గాడ్జెట్ అవార్డు నామినిస్ | Indian Gadget Awards 2020 Nominees | Sakshi
Sakshi News home page

2020 ఇండియన్ బెస్ట్ గాడ్జెట్ అవార్డు నామినిస్

Dec 30 2020 8:03 PM | Updated on Dec 30 2020 8:24 PM

Indian Gadget Awards 2020 Nominees - Sakshi

ఈ కేలండర్‌ 2020 ఏడాదిలో ప్రపంచ దేశాలను కోవిడ్‌-19 వణికించినప్పటికీ మొబైల్ పారిశ్రామిక రంగలో మొదట్లో కొంచెం ఒడి దుడుకులు ఏర్పడినప్పటికీ తర్వాత తిరిగి పుంజుకుంది. దేశం నాలుగు నెలలు పాటు లాక్డౌన్ లో ఉన్నప్పటికీ కంపెనీలు త్వరగా తిరిగి పుంజుకున్నాయి. 2020 ఏర్పడిన అన్ని అడ్డంకులను టెక్నాలజీ సహాయంతో చాలా వరకు ఎదుర్కొన్నాము. గాడ్జెట్ల సహాయంతో జాతీయ, అంతర్జాతీయ సమాచారంతో పాటు గేమ్స్, వినోదాన్ని ప్రజలు ఆస్వాదించారు. లాక్డౌన్ సమయంలో టెక్నాలజీ గాడ్జెట్లు చాలా ముఖ్య పాత్ర పోషించాయి. 

దేశంలో చాలా వరకు కంపెనీలు మూసివేయబడ్డాయి. కొన్ని కర్మాగారాలు సగం సామర్థ్యంతో పనిచేసాయి. ఐటీ ఇండస్ట్రీ చెందిన చాలా ఉద్యోగులు టెక్నాలజీ పుణ్యమా అని ఇంటి నుండే పని చేస్తున్నారు. లాక్ డౌన్ తర్వాత టెక్నాలజీ రంగంలో మళ్లీ కొత్త ఆవిష్కరణలు మొదలయ్యాయి. కరోనా ప్రభావం తర్వాత టెక్నాలజీ రంగం చాలా వేగంగా పుంజుకుంది. ప్రతి రోజు స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు, ల్యాప్‌టాప్‌లు, గేమింగ్ కన్సోల్‌లు, హెడ్‌ఫోన్‌లు వంటివి ఎన్నో మార్కెట్లోకి వస్తున్నాయి. ఈ ఏడాది చాలా గాడ్జెట్లు మార్కెట్ లోకి ఇప్పుడు కొన్ని 2020 ఇండియన్ గాడ్జెట్ అవార్డు కింద ఎంపిక అయ్యాయి. వాటిలో కొన్ని మీకోసం. 

2020 బెస్ట్ గాడ్జెట్ నామినిస్

  • శామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 2
  • ఆపిల్ మాక్బుక్ ఎయిర్ M1
  • ఆపిల్ ఐఫోన్ 12 మినీ
  • ఆపిల్ ఐప్యాడ్ ఎయిర్
  • Xbox సిరీస్ X
  • సోనీ WH-1000XM4

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement