
ముగిసిన మూడో మినిస్టీరియల్ రౌండ్ టేబుల్ సమావేశం
న్యూఢిల్లీలో తాజాగా జరిగిన మూడో భారత్-సింగపూర్ మినిస్టీరియల్ రౌండ్ టేబుల్ (ఐఎస్ఎంఆర్) సమావేశం విజయవంతంగా ముగిసింది. అధిక ప్రభావం ఉన్న రంగాల్లో తమ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవడానికి భారత్-సింగపూర్ పనిచేస్తున్నట్లు ఇరుదేశాల ప్రతినిధులు తెలిపారు. సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ సెప్టెంబర్‌లో భారత పర్యటనకు రానున్న నేపథ్యంలో ఈ సమావేశం కీలకంగా మారింది.
ఈ ఉన్నత స్థాయి మంత్రుల సమావేశంలో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికి ఉద్దేశించిన ఆరు అంశాలపై చర్చ జరిగినట్లు అధికారులు తెలిపారు.
డిజిటలైజేషన్
స్కిల్ డెవలప్‌మెంట్
సుస్థిరత
హెల్త్ కేర్ & మెడిసిన్
అడ్వాన్స్‌డ్ మ్యానుఫ్యాక్చరింగ్
కనెక్టివిటీ
సెమీకండక్టర్స్ అండ్ గ్రీన్ ఎనర్జీ
భారత్ సెమీకండక్టర్ల తయారీ ఆశయాలకు సింగపూర్ మద్దతు ప్రకటించింది. అదనంగా ఇరుపక్షాలు గ్రీన్ హైడ్రోజన్ సహకారాన్ని అన్వేషిస్తున్నట్లు చెప్పాయి. రాబోయే రోజుల్లో ఒడిశా హైడ్రోజన్ ఎగుమతులకు కేంద్రంగా మారుతుందని తెలిపాయి.
స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు
భారత్‌లో ఐదు స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ల ఏర్పాటుకు సింగపూర్ సహకరిస్తుందని తెలిపింది. ఒడిశాలోని ఒక కేంద్రంలో ఏటా 3,000 మంది యువ భారతీయులకు మెకట్రానిక్స్, హెచ్‌వీఏసీ వ్యవస్థల్లో శిక్షణ ఇవ్వనున్నారు.
డేటా, ఫైనాన్షియల్ కోఆపరేషన్
రెండు ఆర్థిక వ్యవస్థల మధ్య సీమాంతర డేటా ట్రాన్స్‌మిషన్‌ను క్రమబద్ధీకరించడానికి, క్యాపిటల్ మార్కెట్ ఏకీకరణను బలోపేతం చేయడానికి అవసరమైన ఫ్రేమ్‌వర్క్‌లను చర్చించారు.
సింగపూర్ నుంచి భారత్ దిగుమతులు: 21.3 బిలియన్ డాలర్లు
సింగపూర్‌కు భారత ఎగుమతులు: 13 బిలియన్ డాలర్లు
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎప్‌డీఐ): భారత్‌కు సింగపూర్ నుంచే అధికంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు సమకూరుతున్నాయి. ఇది మొత్తం ఎఫ్‌డీఐ రాకలో 24% దోహదం చేస్తుంది. గత 25 సంవత్సరాలలో 174.8 బిలియన్ డాలర్లు సమకూరాయి.
ఇదీ చదవండి: అనుమతిస్తే పునప్రారంభానికి సిద్ధం