సీమెన్స్‌ ఎనర్జీ బిజినెస్‌ విడదీత | India Siemens to explore energy business spin | Sakshi
Sakshi News home page

సీమెన్స్‌ ఎనర్జీ బిజినెస్‌ విడదీత

Dec 19 2023 6:15 AM | Updated on Dec 19 2023 6:15 AM

India Siemens to explore energy business spin - Sakshi

న్యూఢిల్లీ: ఎనర్జీ బిజినెస్‌ను విడదీసే ప్రతిపాదనను పూర్తి చేసేందుకు దేశీయంగా సొంత అనుబంధ సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు ప్రయివేట్‌ రంగ దిగ్గజం సీమెన్స్‌ లిమిటెడ్‌ తాజాగా వెల్లడించింది. ఇందుకు బోర్డు గ్రీన్‌సిగ్నల్‌ ఇచి్చనట్లు తెలియజేసింది.

ఎనర్జీ విభాగాన్ని ప్రత్యేక కంపెనీగా ఏర్పాటు చేసే ప్రతిపాదనను పూర్తి చేయవలసిందిగా సీమెన్స్‌ లిమిటెడ్‌ బోర్డును ప్రమోటర్‌ సంస్థలు సీమెన్స్‌ యాక్టింగిసెల్‌షాఫ్ట్‌(జర్మనీ), సీమెన్స్‌ ఇంటర్నేషనల్‌ హోల్డింగ్‌ బీవీ, సీమెన్స్‌ ఎనర్జీ హోల్డింగ్‌ బీవీసహా ప్రధాన ప్రమోటర్‌ సీమెన్స్‌ ఎనర్జీ యాక్టింగిసెల్‌షాఫ్ట్‌ కోరినట్లు కంపెనీ పేర్కొంది.

ప్రతిపాదనపై పరిశీలన, విలువ నిర్ధారణ, తదితర అవసరమైన చర్యలకు తెరతీయనున్నట్లు తెలియజేసింది. వెరసి వెనువెంటనే పూర్తి అనుబంధ సంస్థ ఏర్పాటుకు బోర్డు నిర్ణయించినట్లు వివరించింది.

ఎనర్జీ విడదీత వార్తలతో సీమెన్స్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 6% జంప్‌చేసి రూ. 4,138 వద్ద ముగిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement