ఐక్యరాజ్య సమితిపై మస్క్ కీలక వ్యాఖ్యలు | India Not Having Permanent Seat Absurd, Elon Musk Tweets - Sakshi
Sakshi News home page

భారత్‌కు శాశ్వత సభ్యత్వం లేదు.. ఐక్యరాజ్య సమితిపై మస్క్ కీలక వ్యాఖ్యలు

Jan 23 2024 12:32 PM | Updated on Jan 23 2024 1:05 PM

India Not Having Permanent Seat Absurd Elon Musk Tweet - Sakshi

ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఇలాన్ మస్క్ (Elon Musk).. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశమైన భారత్‌కు శాశ్వత సభ్యత్వం లేకపోవడం అనుచితమంటూ ఐక్యరాజ్య సమితి పనితీరుపైనే కీలక వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.

మారిన పరిస్థితులు, కాలానికి అనుగుణంగా ఆయా దేశాలకు ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉందని మస్క్ పేర్కొన్నాడు. ఇప్పటి వరకు ఇండియాకు సాధారణ సభ్యత్వం మాత్రమే ఉంది, శాశ్వత సభ్యత్వం కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలకు చైనా అడ్డుపడుతోంది.

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో అమెరికా, చైనా, ఫ్రాన్స్, యూకే, రష్యా దేశాలు మాత్రమే శాశ్వత సభ్య దేశాలుగా కొనసాగుతున్నాయి. శాశ్వత సభ్యత్వం కలిగి ఉండటం వల్ల ఈ దేశాలకు ప్రత్యేకంగా వీటో పవర్ కూడా ఉంది. దీంతో ఐక్య రాజ్య సమితి మండలి సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలకు ఏ ఒక్క దేశం అభ్యంతరం చెప్పినా ఈ నిర్ణయం అక్కడిదీ ఆగిపోతుంది.

ఇదీ చదవండి: భారత్ నెలలో చేసేది అమెరికాకు మూడేళ్లు - కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు

భద్రతా మండలిలో ఆఫ్రికా ఖండం నుంచి ఏ ఒక్క దేశానికీ శాశ్వత సభ్యత్వం లేకపోవడం దురదృష్టకరమని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ 'ఆంటోనియో గుటెరస్' తన ఎక్స్ (ట్విటర్) ఖాతా ద్వారా ట్వీట్ చేశారు. 

ఈ ట్వీట్‌పై స్పందించిన ఇజ్రాయెల్ వెంచర్ క్యాపిటలిస్ట్ 'మైఖెల్ ఐసెన్ బర్గ్'.. మరి ఇండియా పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. అంతే కాకూండా.. ఐక్యరాజ్య సమితి కొత్త మండలిని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మారిన కాలానికి అనుగునంగా మార్పు అవసరమని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement