
బఠానీలను ఉచితంగా దిగుమతి చేసుకునే గడువును ప్రభుత్వం అక్టోబర్ 2024 వరకు పొడిగించింది. ఈమేరకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్‌టీ) నోటిఫికేషన్ విడుదల చేసింది.
గతేడాది డిసెంబరులో ప్రభుత్వం బఠానీల దిగుమతిపై ఎలాంటి సుంకం విధించకూడదని నిర్ణయించింది. దాంతో కొన్ని నిబంధనలు తయారుచేసి మార్చి 2024 వరకు అవి అమలులో ఉంటాయని పేర్కొంది. తర్వాత వాటిని జూన్ వరకు పొడిగించారు. తాజాగా ఈ నిబంధనలు అక్టోబర్ వరకు అమలవుతాయని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.
డీజీఎఫ్‌టీ నోటిఫికేషన్ ప్రకారం.. బఠానీల ఇంపోర్ట్స్‌కు సంబంధించి కనీస దిగుమతి ధర (ఎంఐపీ) షరతులు వర్తించవు. ఆన్‌లైన్ మానిటరింగ్ సిస్టమ్‌కు లోబడి ఎంతైనా దిగుమతి చేసుకోవచ్చు. ఎలాంటి సుంకం ఉండదు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 235.92 మిలియన్ డాలర్ల విలువైన బఠానీలను దిగుమతి చేసుకున్నట్లు తెలిసింది.