వేగవంతమైన ఆర్థిక వ్యవస్థగా భారత్‌ | India is Fastest Growing Economy Says IMF | Sakshi
Sakshi News home page

వేగవంతమైన ఆర్థిక వ్యవస్థగా భారత్‌

Mar 2 2025 6:58 AM | Updated on Mar 2 2025 7:03 AM

India is Fastest Growing Economy Says IMF

అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ వెల్లడి

న్యూయార్క్‌: బలమైన ప్రైవేట్‌ పెట్టుబడులు, స్థూల ఆర్థిక స్థిరత్వం నేపథ్యంలో 2025–26లో 6.5 శాతం జీడీపీ వృద్ధిని సాధించడం ద్వారా.. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్‌ తన స్థానాన్ని నిలుపుకుంటుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) సంస్థ తెలిపింది. భారత బలమైన ఆర్థిక పనితీరు 2047 నాటికి అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా మారాలనే ఆశయాన్ని సాకారం చేసుకోవడానికి కీలక, సవాలుతో కూడిన నిర్మాణాత్మక సంస్కరణలను ముందుకు తీసుకెళ్లడానికి దేశానికి అవకాశాన్ని అందిస్తుందని వివరించింది.

నిరంతర స్థూల ఆర్థిక, ఆర్థిక స్థిరత్వం నేపథ్యంలో ప్రైవేట్‌ వినియోగంలో బలమైన వృద్ధితో 2024–25, 2025–26లో వాస్తవ జీడీపీ 6.5% పెరుగుతుందని అంచనా. ఇటీవలి కాలంలో ఆర్థిక వ్యవస్థలో నియంత్రణ ఉన్న ప్పటికీ భారత ఆర్థిక వృద్ధి బలంగానే ఉంది. 2024–25 మొదటి అర్ధభాగంలో జీడీపీ వృద్ధి 6%గా ఉంది’ అని వివరించింది.

నిరర్థక రుణాలు తగ్గాయి..
అధిక నాణ్యత ఉద్యోగాలను సృష్టించడానికి, పెట్టుబడులను ఉత్తేజపరిచేందుకు, అధిక వృద్ధి అవకాశాలను అందుకోవడానికి సమగ్ర నిర్మాణాత్మక సంస్కరణలు చాలా ముఖ్యమైనవని ఐఎంఎఫ్‌ తెలిపింది. ‘కార్మిక మార్కెట్‌ సంస్కరణలను అమలు చేయడం, మానవ వనరుల బలోపేతం, శ్రామిక శక్తిలో మహిళల అధిక భాగస్వామ్యానికి మద్దతు ఇవ్వడంపై దృష్టి పెట్టాలి.

ఆహార ధరల హెచ్చుతగ్గులు కొంత అస్థిరతను సృష్టించినప్పటికీ రిజర్వ్‌ బ్యాంక్‌ టాలరెన్స్‌ బ్యాండ్‌ (2 నుండి 6 శాతం) పరిధిలో ద్రవ్యోల్బణం విస్తృతంగా తగ్గింది. ఆర్థిక రంగం స్థితిస్థాపకంగానే ఉంది. నిరర్థక రుణాలు బహుళ సంవత్సరాల కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఆర్థిక ఏకీకరణ కొనసాగింది. సర్వీ సెస్‌ ఎగుమతుల్లో బలమైన వృద్ధి మద్దతు తో కరెంట్‌ ఖాతా లోటు చాలా అదుపులో ఉంది’ అని వివరించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement