క్యూ4లో 7.1 బిలియన్‌ డాలర్లు  | India current account surplus at 7. 1 Billion dollars in Q4 FY26 | Sakshi
Sakshi News home page

క్యూ4లో 7.1 బిలియన్‌ డాలర్లు 

Jun 9 2026 4:17 AM | Updated on Jun 9 2026 4:17 AM

India current account surplus at 7. 1 Billion dollars in Q4 FY26

కరెంట్‌ ఖాతా మిగులు  

సర్వీసుల ఎగుమతులు, రెమిటెన్స్‌ల దన్ను

ముంబై: గత ఆర్థిక సంవత్సరం(2025–26) చివరి త్రైమాసికం(క్యూ4)లో దేశీ కరెంట్‌ ఖాతా 7.1 బిలియన్‌ డాలర్ల మిగులును సాధించింది. ఇది దేశ జీడీపీలో 0.7 శాతంకాగా.. ఇందుకు సరీ్వసుల ఎగుమతులు,  అధిక రెమిటెన్సులు సహకరించాయి. 

అయితే అంతక్రితం ఏడాది(2024–25) జనవరి–మార్చి(క్యూ4)లో 13.7 బిలియన్‌ డాలర్ల మిగులు నమోదైంది. ఇది జీడీపీలో 1.4 శాతానికి సమానం. ఆర్‌బీఐ బ్యాలన్స్‌ ఆఫ్‌ పేమెంట్స్‌(బీవోపీ)పై తాజాగా విడుదల చేసిన గణాంకాలివి. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి కరెంట్‌ ఖాతా లోటు(క్యాడ్‌) 25.2 బిలియన్‌ డాలర్లుగా ఉంది. జీడీపీలో ఇది 0.6 శాతంకాగా.. 2024–25లోనూ 22.9 బిలియన్‌ డాలర్ల(0.6 శాతం) క్యాడ్‌ నమోదైంది. 

క్యూ4 వివరాలిలా 
గతేడాది క్యూ4లో మెర్కండైజ్‌ వాణిజ్య లోటు 83.4 బిలియన్‌ డాలర్లుకాగా.. 2024–25 చివరి త్రైమాసికంలో నమోదైన 59.3 బిలియన్‌ డాలర్లకంటే భారీగా పెరిగింది. 

సర్వీసుల నికర వసూళ్లు 
(రిసీప్‌్ట్స) 53.3 బిలియన్‌ డాలర్ల నుంచి 60.4 బిలియన్‌ డాలర్లకు ఎగశాయి. వార్షికంగా సరీ్వసుల ఎగుమతులు ప్రధాన కేటగిరీలైన కంప్యూటర్‌ సరీ్వసులు, ఇతర బిజినెస్‌ సరీ్వసులలో బలపడ్డాయి. ఈ కాలంలో సెకండరీ ఆదాయ ఖాతాకింద వ్యక్తిగత బదిలీ రిసీప్‌్ట్స(రెమిటెన్స్‌లు) 33.9 బిలియన్‌ డాలర్ల నుంచి 43.5 బిలియన్‌ డాలర్లకు జంప్‌చేశాయి. 

ఫైనాన్షియల్‌ ఖాతాలోనూ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐలు) నికరంగా 0.4 బిలియన్‌ డాలర్ల నుంచి 4.2 బిలియన్‌ డాలర్లకు ఎగశాయి. మరోపక్క విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్‌మెంట్‌(ఎఫ్‌పీఐ) నుంచి 12 బిలియన్‌ డాలర్ల నికర పెట్టుబడులు లభించాయి. అయితే అంతక్రితం ఏడాది క్యూ4లో 5.9 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు వెనక్కి మళ్లాయి. బీవోపీ ప్రాతిపదికన విదేశీ మారక నిల్వలు 7.2 బిలియన్‌ డాలర్లమేర బలపడ్డాయి. అంతక్రితం క్యూ4లో ఇవి 7.2 బిలియన్‌ డాలర్లమేర పుంజుకున్నాయి.  

పూర్తి ఏడాదికి 
గతేడాది నికర ఎఫ్‌డీఐ పెట్టుబడులు 6.9 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. 16.4 బిలియన్‌ డాలర్ల ఎఫ్‌పీఐ పెట్టుబడులు తరలిపోయాయి. 2024–25లో 3.6 బిలియన్‌ డాలర్ల ఎఫ్‌పీఐ పెట్టుబడులు లభించాయి. విదేశీ మారక నిల్వలు 23.6 బిలియన్‌ డాలర్లమేర క్షీణించాయి. అంతక్రితం ఏడాదిలో ఈ క్షీణత 5 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement