దేశాల జీడీపీలను దాటేసిన మస్క్‌ సంపద | Elon Musk Becomes World First Trillionaire Surpassing Nations GDPs | Sakshi
Sakshi News home page

దేశాల జీడీపీలను దాటేసిన మస్క్‌ సంపద

Jun 12 2026 10:52 AM | Updated on Jun 12 2026 11:14 AM

Elon Musk Becomes World First Trillionaire Surpassing Nations GDPs

ఎలాన్ మస్క్ వ్యక్తిగత సంపద ఇప్పుడు ప్రపంచంలోని కొన్ని ప్రధాన దేశాల మొత్తం ఆర్థిక వ్యవస్థలను (జీడీపీ) సైతం అధిగమించడం చర్చనీయాంశమైంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐంఎఎఫ​్‌) తాజా అంచనాలతో మస్క్ సంపదను పోల్చి చూస్తే ఆశ్చర్యకరమైన వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. 

ఆధునిక పారిశ్రామిక ప్రపంచంలో అసాధ్యాలను సుసాధ్యం చేస్తూ వివాదాలు-విజయాల నడుమ దూసుకుపోతున్న ప్రముఖ పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్ చరిత్ర సృష్టించారు. అంతరిక్ష పరిశోధనా రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఆయన సంస్థ ‘స్పేస్‌ఎక్స్’ యూఎస్‌ మార్కెట్‌లో రికార్డు స్థాయిలో 75 బిలియన్ డాలర్ల పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) నిధులను సేకరించింది. దాంతో మస్క్ అధికారికంగా ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రిలియనీర్‌ డాలర్లకుపైగా(సుమారు రూ.103 లక్షల కోట్లు) ఆస్తుల అధిపతిగా అవతరించారు.

తైవాన్ కంటే ఎక్కువే.

సెమీకండక్టర్ల తయారీలో ప్రపంచ కేంద్రంగా పేరొందిన తైవాన్ దేశ వార్షిక జీడీపీ 976.7 బిలియన్ డాలర్లు. అయితే, స్పేస్‌ఎక్స్ ఐపీఓ తర్వాత మస్క్ నికర సంపద 1.1 ట్రిలియన్ డాలర్లకు (1,100 బిలియన్ డాలర్లు) చేరడంతో తైవాన్ దేశం ఒక ఏడాదిలో సృష్టించే మొత్తం ఆర్థిక విలువ కంటే మస్క్ వ్యక్తిగత ఆస్తే ఎక్కువని తేలింది.

ఐఎంఎఫ్ గణాంకాల ప్రకారం.. సంపన్న దేశాలైన నెదర్లాండ్స్ (జీడీపీ సుమారు 1.1 ట్రిలియన్ డాలర్లు), టర్కీ (జీడీపీ సుమారు 1.1 ట్రిలియన్ డాలర్లు), సౌదీ అరేబియా (జీడీపీ సుమారు 1.05 ట్రిలియన్ డాలర్లు) వంటి దేశాల మొత్తం ఆర్థిక వ్యవస్థల పరిమాణంతో ఎలాన్ మస్క్ ఒంటరిగా పోటీ పడుతున్నారు. ఒక వ్యక్తి ఆస్తులు ఏకంగా ఒక సార్వభౌమ దేశ ఆర్థిక వ్యవస్థను దాటిపోవడం ప్రపంచ ఆర్థిక చరిత్రలోనే ఇది మొదటిసారి.

ఇదీ చదవండి: స్పేస్‌ఎక్స్‌ ఐపీఓతో ప్రభంజనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement