ఐఐటీ పరిశోధకులు అద్భుత ఆవిష్కరణ.. తగ్గనున్న ఎలక్ట్రికల్ వాహన ధరలు!

IIT Researchers Develop New Tech For Charging Electric Vehicles - Sakshi

IIT Researchers Develop New Tech: కరోనా మహమ్మారి తర్వాత అత్యంత వేగంగా పరుగులు పెడుతున్న రంగం ఏదైనా ఉంది అంటే? అది, ఎలక్ట్రిక్ వాహన రంగం అని చెప్పుకోవాలి. ఈ రంగంలో తమ మార్క్ చూపించేందుకు దిగ్గజ కంపెనీలతో పాటు స్టార్టప్ కంపెనీలు, ఐఐటీ విశ్వవిద్యాలయాలు పోటీ పడుతున్నాయి. తాజాగా మన దేశంలోని రెండు ప్రముఖ ఐఐటీలకు చెందిన పరిశోధకులు ఎలక్ట్రిక్ వాహనాలను ఛార్జ్ చేయడానికి సరికొత్త టెక్నాలజీని అభివృద్ధి చేశారు. ఈ టెక్నాలజీ వల్ల ప్రస్తుత ఆన్-బోర్డ్ ఛార్జర్ టెక్నాలజీలో సగం ఖర్చు అవుతుంది. దీంతో ఎలక్ట్రిక్ వాహనాల ఖర్చు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.

ఈ పరిశోధకుల బృందం తెలిపిన వివరాల ప్రకారం.. దేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీదారుల్లో ఒక కంపెనీ ఈ కొత్త టెక్నాలజీపై ఆసక్తి చూపినట్లు పేర్కొంది. ఇప్పటికే ఉన్న ఎలక్ట్రిక్ వాహనాలకు ఈ టెక్నాలజీ వినియోగించడానికి, పూర్తి స్థాయి వాణిజ్య ఉత్పత్తిని అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఈ బృందం పేర్కొంది. ఐఐటీ గౌహతి & ఐఐటీ భువనేశ్వర్ నిపుణులతో కలిపి వారణాసిలోని ఐఐటి(బిహెచ్‌యు) వద్ద ఈ టెక్నాలజీని అభివృద్ధి చేశారు. 

"దేశంలో పెరుగుతున్న పెట్రోల్ & డీజిల్ ధరలు సామాన్యులకు ఆందోళన కలిగిస్తాయి. పెట్రోలియం ఉత్పత్తుల ధర పెరగడం, కాలుష్య స్థాయి అసాధారణ రీతికి పెరగడం మధ్య, ఎలక్ట్రిక్ వాహనాలు(ఈవీలు) సంప్రదాయ ఐసీ వాహనలకు ఉత్తమ ప్రత్యామ్నాయం. కానీ, అధిక ధరల వల్ల వినియోగదారులు వెనుకడుగు వేస్తున్నారు " అని ఐఐటీ బిహెచ్‌యు చీఫ్ ప్రాజెక్ట్ ఇన్వెస్టిగేటర్ రాజీవ్ కుమార్ సింగ్ అన్నారు. ఈ టెక్నాలజీ కారణంగా ప్రస్తుతం ఉన్న దానితో పోలిస్తే ఆన్ బోర్డ్ ఛార్జర్ ఖర్చు దాదాపు 40-50 తగ్గుతుందని సింగ్ వివరించారు. దీనివల్ల అంతిమంగా ఎలక్ట్రిక్ వాహనాల ధరలు తగ్గుతాయని పేర్కొన్నారు.

(చదవండి: బేర్ దెబ్బకు కుదేలైన దలాల్‌ స్ట్రీట్‌.. ఒక్కరోజులో రూ.10లక్షల కోట్లు ఆవిరి)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top