హైదరాబాద్‌: వేర్‌హౌసింగ్‌ స్థలాలకు విపరీతమైన డిమాండ్‌

Hyderabad: Ware Housing Places Demand Rises 128 Pc Hikes Compared As Year - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లో గిడ్డంగుల స్థలాల సరఫరా, డిమాండ్‌ పెరిగింది.  శంషాబాద్, మేడ్చల్, పటాన్‌చెరు ప్రాంతాలు వేర్‌హౌస్‌ క్లస్టర్లుగా అభివృద్ధి చెందాయి. వీటిల్లో మేడ్చల్‌ వేర్‌హౌస్‌ హబ్‌గా మారిపోయింది. 2021–22లలో హైదరాబాద్‌లో 54 లక్షల చ.అ. వేర్‌హౌస్‌ స్థల లావాదేవీలు జరిగాయి. 24 లక్షల చ.అ. లావాదేవీలు జరిగిన క్రితం ఏడాదితో పోలిస్తే ఇది 128 శాతం ఎక్కువ అని నైట్‌ఫ్రాంక్‌ ఇండియా వేర్‌హౌసింగ్‌ నివేదిక వెల్లడించింది. 

► 2021 ఆర్ధిక సంవత్సరంతో పోలిస్తే రిటైల్‌ రంగం 2022 ఆర్ధిక సంవత్సరంలో 17 శాతం మేర పెరిగింది. దీంతో ఈ–కామర్స్, రిటైల్, ఫాస్ట్‌ మూవింగ్‌ కన్జ్యూమర్‌ గూడ్స్‌ (ఎఫ్‌ఎంసీజీ) పరిశ్రమలు వృద్ధి చెందుతుంది. ఫలితంగా వేర్‌హౌస్‌ విభాగానికి డిమాండ్‌ ఏర్పడింది. ఫ్లిప్‌కార్ట్, రిలయన్స్‌ రిటైల్, ఈకామ్‌ ఎక్స్‌ప్రెస్, డీమార్ట్, ఎస్‌వీఎస్‌ ఫార్మా వంటి ప్రధాన కంపెనీలు నగరంలో వేర్‌హౌస్‌ స్థలాన్ని ఆక్రమించాయి.

చాలా వరకు లాజిస్టిక్, ఈ–కామర్స్‌ కంపెనీలు గిడ్డంగుల కార్యాకలాపాల నిర్వహణను థర్డ్‌ పార్టీ లాజిస్టిక్‌ (3 పీఎల్‌) కంపెనీలకు అందిస్తున్నాయి. 3 పీఎల్‌ సంస్థల వృద్ధితో వేర్‌హౌస్‌ స్థలాలకు డిమాండ్‌ ఏర్పడింది. 2021 ఆర్ధిక సంవత్సరంలో 24 శాతంగా ఉన్న 3 పీఎల్‌ సేవల డిమాండ్‌ 2022 ఆర్ధిక సంవత్సరం నాటికి 31 శాతానికి పెరిగిందని నివేదిక వెల్లడించింది. వేర్‌హౌస్‌ విభాగంలో ఈక్విటీ పెట్టుబడులు కూడా పెరుగుతున్నాయి. గతేడాది ఈ రంగంలోకి 1.3 బిలియన్‌ డాలర్ల ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ రాగా.. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లోనే 1.2 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులొచ్చాయి.

మేడ్చల్‌ క్లస్టర్‌ జోష్‌.. 
►  హైదరాబాద్‌లోని గిడ్డంగుల స్థల లావాదేవీలలో మేడ్చల్‌ కస్టర్ల జోరు మీద ఉంది. 2021–22లో జరిగిన వేర్‌ హౌస్‌ లావాదేవీలలో అత్యధికంగా ఈ జోన్‌లోనే జరిగా యి. 2021 ఆర్ధిక సంవత్సరంలో 48% వాటా ఉన్న మేడ్చల్‌ క్లస్టర్‌ 2022 ఆర్ధిక సంవత్సరం నాటికి 60 శాతానికి పెరిగింది. 
►  శంషాబాద్‌ క్లస్టర్‌ 51 శాతం నుంచి ఏకంగా 30 శాతానికి క్షీణించింది. అలాగే పటాన్‌చెరు క్లస్టర్‌ 2% నుంచి 10%కి 
పెరిగింది. 
►  మేడ్చల్, పటాన్‌చెరు గిడ్డంగుల క్లస్టర్లలో భూముల ధరలు పెరిగినా.. వేర్‌హౌస్‌ స్థలాల అద్దె లు స్ధిరంగానే ఉన్నాయి. 

ధరలెలా ఉన్నాయంటే.. 
మేడ్చల్‌ 
►    ఎకరం రూ.1.5 కోట్ల నుంచి రూ.4.5 కోట్లు 
►    గ్రేడ్‌–ఏ గిడ్డంగుల అద్దె చ.అ.కు రూ.17–21 
►    గ్రేడ్‌–బీ అద్దె చ.అ.కు రూ.16–19 
ప్రాజెక్ట్‌లు: ముసద్దిలాల్‌ ప్రాజెక్ట్స్, జీరో మైల్‌ వేర్‌హౌసింగ్‌ 

పటాన్‌చెరు 
►    ఎకరం రూ.1.4 కోట్ల నుంచి రూ.4.5 కోట్లు 
►    గ్రేడ్‌–ఏ గిడ్డంగుల అద్దె చ.అ.కు రూ.17–20 
►   గ్రేడ్‌–బీ అద్దె చ.అ.కు రూ.14–18 
ప్రాజెక్ట్‌లు: ఆల్‌కార్గో లాజిస్టిక్స్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ పార్క్స్‌ 

శంషాబాద్‌ 
►   ఎకరం రూ.1.5 కోట్ల నుంచి రూ.2.5 కోట్లు 
►    గ్రేడ్‌–ఏ గిడ్డంగుల అద్దె చ.అ.కు రూ.18–20 
►    గ్రేడ్‌–బీ అద్దె చ.అ.కు రూ.15–17 
ప్రాజెక్ట్‌లు: ఈఎస్‌ఆర్‌ జీఎంఆర్‌ ఇండస్ట్రియల్‌ అండ్‌ 
లాజిస్టిక్‌ పార్క్, కే రహేజా కార్ప్‌ ఇండస్ట్రియల్‌ పార్క్‌. 

చదవండి: మాదాపూర్‌ గుర్తుందా.. మళ్లీ అదే తరహా డెవలప్‌మెంట్‌ అక్కడ మొదలైంది!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top