హైదరాబాద్‌కు రానున్న బిల్‌ గేట్స్, సత్య నాదెళ్ల

Hyderabad: 20th Edition of BioAsia 2023 to be Held in February - Sakshi

ఫిబ్రవరిలో బయో ఏషియా సదస్సు

మూడురోజుల పాటు జరగనున్న సదస్సు

సాక్షి, హైదరాబాద్ః వచ్చే ఏడాది ఫిబ్రవరి 24 నుంచి 26వ తేదీ వరకు బయో ఏషియా 20వ వార్షిక సదస్సు హైదరాబాద్‌ వేదికగా జరగనుంది. ఈ సదస్సులో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను (ఎంఎస్‌ఎంఈ) ప్రోత్సహించేందు కు కేంద్ర ఎంఎస్‌ఎంఈ విభాగంతో బయో ఏషి యా భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకోనుంది. 


ఏషియాలో అతిపెద్దదైన లైఫ్‌ సైన్సెస్, హెల్త్‌ టెక్‌ వేదికగా బయో ఏషియా సదస్సును తెలంగాణ ప్రభుత్వం ఏటా నిర్వహిస్తోంది. ఆ సదస్సులో ఎంఎస్‌ఎంఈలకు ప్రత్యేక పెవిలియన్‌ కేటాయిస్తారు. ఇందులో వైద్య ఉపకరణాలు, ఫార్మా స్యూటికల్స్‌తో పాటు అనుబంధ పరిశ్రమలకు చెందిన 60 ఎంఎస్‌ఎంఈలు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తాయి.  రెండు దశాబ్దాలుగా హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ సదస్సులో హెల్త్‌కేర్, లైఫ్‌సైన్సెస్‌ రంగాలకు చెందిన అంతర్జాతీయ సంస్థలు, పరిశ్రమలతో పాటు స్థానిక సంస్థలు భాగస్వాములుగా ఉంటున్నాయని ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ వెల్లడించారు. 

సదస్సుకు అనేక మంది నోబుల్‌ బహుమతి విజేతలతో పాటు గేట్స్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ బిల్‌ గేట్స్, మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల, నోవార్టిస్‌ సీఈఓ వాస్‌ నర్సింహన్, మెడ్‌ట్రానిక్స్‌ సీఈవో జెఫ్‌ మార్తా వంటి ప్రముఖులు హాజరవుతున్నట్లు బయో ఏషియా సీఈవో శక్తి నాగప్పన్‌ వెల్లడించారు. (క్లిక్ చేయండి: రాయదుర్గం టు శంషాబాద్‌.. ఏనోట విన్నా అదే చర్చ)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top