మెట్రో.. మెట్రో: రాయదుర్గం టు శంషాబాద్‌.. ఏనోట విన్నా అదే చర్చ

Hyderabad: Route Clear on Rayadurgam To Shamshabad Metro - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాయదుర్గం మెట్రో రైల్వేస్టేషన్‌ నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు వరకు మెట్రో రైలు విస్తరణ చేపట్టాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. దీంతో రూ.6,200 కోట్ల అంచనా వ్యయంతో త్వరలో మెట్రో పనులు ప్రారంభం కానున్నాయి.  శుక్రవారం సీఎం కేసీఆర్, రాష్ట్ర మంత్రులు, అధికారుల సమక్షంలో శంకుస్థాపన చేసేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మెట్రోతో సమయం, డబ్బు, ట్రాఫిక్‌ లేకుండా రాకపోకలు సాగించే వీలుండడంతో సర్వత్రా సంతోషం వ్యక్తం అవుతోంది.

కొన్ని రోజులుగా మధురానగర్, ప్రశాంత్‌హిల్స్‌ కాలనీ, సాయివైభవ్‌ కాలనీ, సాయిఐశ్వర్య కాలనీ, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ల్యాంకోహిల్స్, నానాక్‌రాంగూడ ప్రాంతాలలో మెట్రోపై అందరూ చర్చించుకుంటున్నారు. గచ్చిబౌలి డివిజన్‌ అనగానే ఐటీ కారిడార్, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ ఏర్పాటుతో జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, ఉన్నత విద్యా, శిక్షణ సంస్థలకు నిలయం. అలాంటి ప్రాంతానికి మెరుగైన రవాణా కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. 

మెట్రో రూటు ఇదే..  
రాయదుర్గం సర్వే నంబర్‌–83కి చేరువలోనే ఉన్న రాయదుర్గం మెట్రో రైల్వేస్టేషన్‌ నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు వరకు విస్తరిస్తారు. 
ముఖ్యంగా బయోడైవర్సిటీ పార్కు కూడలి చేరువ నుంచి మధురానగర్, ఖాజాగూడ, నానక్‌రాం గూడ ఓఆర్‌ఆర్‌ అండర్‌ బ్రిడ్జి పక్కనే ఉన్న సరీ్వస్‌ రోడ్డు ద్వారా నార్సింగి మీదుగా శంషాబాద్‌ వరకు మెట్రో రైలు నడపాలని భావిస్తున్నారు. 
ఈ మెట్రోతో గచి్చ»ౌలి, మధురానగర్, రాయదుర్గం, ప్రశాంత్‌హిల్స్, ఖాజాగూడ, సాయివైభవ్‌ కాలనీ, సాయిఐశ్వర్యకాలనీ, ల్యాంకోహిల్స్, నానక్‌రాంగూడ, పరిసరాల్లోని వారికి మేలు కలుగుతుంది.  
ఇటీవల ఈ ప్రాంతాలలో గేటెడ్‌ కమ్యూనిటీలు, అపార్ట్‌మెంట్లు విరివిగా పెరగడం, ఇంకా పలు భవనాలు నిర్మాణంలో ఉండడంతో వీరంతా సంతోíÙస్తున్నారు. 
ఐటీ కారిడార్, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ ప్రాంతాల లోని ఐటీ, ఇతర సంస్థల ఉద్యోగులు కూడా మెట్రో రాకతో సొంత వాహనాలు పక్కనపెట్టి మెట్రోలోనే రాకపోకలు సాగించే అవకాశం ఉంది. 

సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ చొరవతోనే..  
సీఎం కేసీఆర్, మంత్రి కేటీరామారావు ప్రత్యేక చొరవతోనే గచ్చిబౌలి డివిజన్‌కు మెట్రో సౌకర్యం ఏర్పడే అవకాశం కలుగుతోంది. ఇప్పటికే లింకురోడ్లు, ఫ్లైఓవర్లతో చాలా వరకు తగ్గినా ఈ మెట్రోతో మా ప్రాంతంలో ట్రాఫిక్‌ సమస్య చాలా వరకు తీరే అవకాశం ఉంది. రవాణా సౌకర్యం మరింతగా చేరువ కానుండడంపై అందరిలోనూ సంతోషం వ్యక్తం అవుతోంది. 
–సాయిబాబా, గచ్చిబౌలి మాజీ కార్పొరేటర్‌  

రైలు సౌకర్యం వస్తుందని అనుకోలే..  
మా మధురానగర్, ఖాజాగూడ, నానక్‌రాంగూడ, పరిసరాలకు మెట్రో సౌకర్యం కలుగుతుందనే భావన ఎంతో సంతోషానిస్తోంది. ఇటీవల అపార్ట్‌మెంట్‌లు విపరీతంగా వెలిశాయి. దీనికితోడు ఐటీ సంస్థలు, స్కూళ్లు పెద్ద సంఖ్యలో ఉండడంతో ట్రాఫిక్‌ రోజురోజుకూ పెరిగిపోతోంది. అది చాలా వరకు తగ్గుతుంది. 
– రమేష్‌గౌడ్,మధురానగర్‌ 

మెట్రో రావడం చాలా సంతోషం.. 
మెట్రోతో ముఖ్యంగా యువత, విద్యార్థులు, ఐటీ ఉద్యోగులకు ఎంతో మేలు చేకూరుతుంది. మియాపూర్, మాదాపూర్‌ వరకు వచి్చంది. మాకు కూడా వచి్చంటే బాగుండు అనుకున్నం. శంషాబాద్, నార్సింగి, గచ్చి»ౌలి, మాదాపూర్‌ వంటి ప్రాంతాలతోపాటు ఇతర చోట్లకు వెళ్ళేందుకు సమయం, డబ్బు ఆదాతోపాటు వేగంగా Ðð ళ్లేందుకు అవకాశం కలుగుతుంది.                                                                       
–పొన్నయ్య, ఖాజాగూడ  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top