ప్రైవేట్‌ బ్యాంకుల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు శుభవార్త!

From HSBC to Citi, global banks expand maternity benefits to retain women in India - Sakshi

ప్రైవేట్‌ బ్యాంకుల్లో విధులు నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగులకు బంపరాఫర్‌. భారత్‌లో దేశీయ బ్యాంకుల నుంచి అంతర్జాతీయ గ్లోబల్ ఫైనాన్షియల్ సంస్థల వరకు మహిళా ఉద్యోగుల్ని ఆకర్షిస్తూ, వారిని నిలుపుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా వారికి ప్రోత్సహకాలు అందిస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఫలితంగా ప్రైవేట్‌ బ్యాంకుల్లో పనిచేసే మహిళా ఉద్యోగులకు భారీ ఊరట కలగనుంది. 

భారత్‌లోని హెచ్‌ఎస్‌బీసీ సంస్థలో ఆరేళ్లకు మించి పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు ప్రత్యేకంగా బోనస్‌లు అందిస్తుంది. గర్భిణీ సిబ్బంది క్యాబ్ రైడ్‌లకు అయ్యే ఖర్చును మోర్గాన్ స్టాన్లీ భరిస్తుంది. సిటీ గ్రూప్‌ సంస్థ కొత్తగా తల్లైన మహిళ ఉద్యోగుల మెటర్నిటీ లీవులు పూర్తయితే మరో ఏడాది పాటు ఇంటి వద్ద నుంచి పనిచేసేలా వెసలు బాటు కల్పిస్తున్నట్లు ప్రకటించింది. 

ప్రత్యేక నియామకం
వరల్డ్‌ బ్యాంక్‌ జెండర్ డేటా పోర్టల్ ప్రకారం, భారత్‌ ఇప్పటికే పూర్తి వేతనంతో మహిళ ఉద్యోగులకు కనీసం 26 వారాల ప్రసూతి సెలవును తప్పనిసరి చేసింది. 50 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉంటే సదరు బ్యాంకులు మహిళలకు డేకేర్‌ (0-5 ఏళ్ల మధ్య ఉన్న పిల్లల సంరక్షణ చూసుకునే బాధ్యత) సౌకర్యాల్ని కల్పించేలా చట్టాల్ని తెచ్చింది.రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో ప్రతిభావంతులైన మహిళల్ని ఎంపిక చేసుకోవడం, ఇప్పటికే బ్యాంకుల్లో పనిచేస్తున్న వారి నిర్ధిష్ట అవసరాల్ని హెచ్‌ఎస్‌బీసీ తీరుస్తుంది. దీంతో పాటు మహిళా ఉద్యోగుల  0 నుంచి 6 వయస్సున్న పిల్లల సంరక్షణ కోసం నెలావారీ 216 డాలర్లను అందిస్తుంది. 

మెటర్నిటీ లీవులు పూర్తయితే 
మోర్గాన్ స్టాన్లీ ముంబై, బెంగుళూరులలో గర్భిణీ ఉద్యోగులు డెలివరీ ముందు చివరి మూడునెలల్లో ట్రైన్లు, బస్సుల్లో ప్రయాణించే విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్నిసార్లు ఆ కారణంతో ఉద్యోగాలకు రాజీనామా చేస్తున్నట్లు మోర్గాన్‌ స్టాన్లీ ఇండియా హెచ్‌ఆర్‌ హెడ్‌ రజత్ మాథుర్ అన్నారు. కాబట్టే మెటర్నిటీ లీవులు పూర్తయిన మహిళా ఉద్యోగులు తిరిగి సంస్థల్లో పనిచేసేలా కోచింగ్‌తో పాటు శిక్షణ ఇస్తుంది. తండ్రులకు కనీసం 16 వారాల వరకు సెలవులను అందిస్తుంది. భారతీయ చట్టం ప్రకారం.. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు 15 రోజుల పెటర్నిటీ సెలవుల్ని అందిస్తుంది. అయితే ప్రైవేట్ రంగానికి కనీస నిబంధనలు లేవు.

అమెరికాలో అంతంతమాతమ్రే
ఇక్కడ ఇలా ఉంటే అమెరికాలో మాత్రం నిబంధనలు అందుకు విరుద్దంగా ఉన్నాయి. మహిళ ఉద్యోగులు సెలవుల్లో ఉంటే వారికి పూర్తి స్థాయిలో వేతనాలు చెల్లించాలనే చట్టపరమైన నిబంధనలు లేవు. కాబట్టే జేపీ మోర్గాన్ చేజ్ అండ్‌ కో, బ్యాంక్ ఆఫ్ అమెరికా కార్పొరేషన్‌లు తల్లదండ్రులిద్దరికి 16 వారాల సెలవును అందిస్తుంది. గోల్డ్‌మాన్‌ సాచెస్‌ గ్రూప్‌ తల్లిదండ్రులకు 20 వారాల మెటర్నిటీ లీవ్‌ల్ని అందిస్తుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top