Who Viewed My Facebook Profile: మీ ఫేస్‌బుక్ ప్రొఫైల్‌ని ఎవరు చూశారో తెలుసుకోండి ఇలా..?

How To Know Who Viewed Your Facebook Profile with These Hacks - Sakshi

ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన సోషల్ మీడియా వేదికలలో ఫేస్‌బుక్ ఒకటి. సోషల్ మీడియా ప్లాట్ ఫార‌మ్‌లలో ఫేస్‌బుక్ స్థానం ప్రత్యేకమైనది అని చెప్పవచ్చు. ఈ ప్లాట్ ఫార‌మ్‌ను స్నేహితులతో చాట్ చేయడానికి, ఆన్‌లైన్ గేమ్‌లు ఆడటానికి, వీడియోలను చూడటానికి ఎక్కువగా ఉపయోగిస్తారు. ఫేస్‌బుక్‌లో ప్రతి ఒక్కరికి తమ కంటూ ఒక ప్రత్యేక అకౌంట్ ఉంటుంది. దీనిని మనం ఫేస్‌బుక్ ప్రొఫైల్ అని కూడా పిలుస్తాము.  దీని ద్వారా ప్రపంచంలోని ఇతర ఫేస్‌బుక్ ఖాతాదారులతో స్నేహం చేయవచ్చు. 

ఇలాంటి ప్రముఖ సోషల్ మీడియా యాప్లో మీ ప్రొఫైల్ ఎవరో ఒకరు చూస్తూ ఉంటారు. అయితే, సాధారణంగా మీతో స్నేహం చేయాలనుకునే వారు.. కొత్త స్నేహితాలను కనుగునే వారు ఫేస్‌బుక్ ప్రొఫైల్ చెక్ చేస్తారు. అయితే, మన ఫేస్‌బుక్ ప్రొఫైల్‌ని ఎంత మంది రోజు చూస్తున్నారో మనం తెలుసుకోవచ్చు, అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం.. 

మీ ఫేస్‌బుక్ ప్రొఫైల్‌ని ఎవరు చూశారో ఎలా తెలుసుకోవాలి?

  • మీరు మొదట మీ ఫేస్‌బుక్ ఖాతాను డెస్క్ టాప్ లేదా ల్యాప్ టాప్ లో ఓపెన్ చేయండి.
  • ఇప్పుడు మీ ఫేస్‌బుక్ ఖాతా ఓపెన్ చేసిన తర్వాత రైట్ క్లిక్ చేయండి.
  • ఇప్పుడు మీ ఫేస్‌బుక్ సోర్స్ చూడటం కోసం 'View Page Source' మీద క్లిక్ చేయండి. 
  • పేజీ సోర్స్ ఓపెన్ చేసిన తర్వాత కంట్రోల్+ఎఫ్(Ctrl+F) క్లిక్ చేయండి.
  • ఇప్పుడు, సెర్చ్ బార్ లో 'BUDDY_ID' టైప్ చేయండి. 
  • మీకు 'BUDDY_ID' పక్కన అనేక ఫేస్ బుక్ ప్రొఫైల్ ఐడీలు కనిపిస్తాయి, ఆ ఐడీలను కాపీ చేయండి.

  • ఇప్పుడు కొత్త ట్యాబ్ తెరిచి ఉదా: 'Facebook.com/123456789123456' అని టైపు చేయండి. 
  • ఎవరో మీ ఫేస్‌బుక్ ప్రొఫైల్‌ని చూశారో వారి ఫేస్‌బుక్ ప్రొఫైల్‌ ఓపెన్ అవుతుంది. 
  • ఇలా మొత్తం ఐడీలు నమోదు చేసి ఎంత మంది మన ఫేస్‌బుక్ ప్రొఫైల్‌ని చూశారో తెలుసుకోవచ్చు. 

(చదవండి: Work From Home: వర్క్‌ ఫ్రమ్‌ హోం ఉద్యోగులకు కేంద్రం గుడ్‌న్యూస్‌..!)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top