ఐఆర్‌సీటీసీలో నెలకు రూ.30 - 80 వేలు సంపాదించండిలా !

How To Earn Money From Irctc Complete Details Here - Sakshi

మీరు ఆన్‌లైన్‌లో డబ్బులు సంపాదించాలని అనుకుంటున్నారా? అయితే మీకో శుభవార్త. ఆన్‌లైన్‌ లో నెలకు రూ.80 వేలు సంపాదించే అవకాశాన్ని కల్పిస్తుంది ఇండియన్‌ రైల్వే. ఇండియన్‌ రైల్వేకి చెందిన ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరోషన్‌ (irctc) లో ట్రైన్‌ టికెట్లు బుక్‌ చేసి మనీ ఎర్న్‌ చేయవచ్చు. ప్రతి టికెట్‌ బుకింగ్‌ పై కమిషన్‌ రూపంలో ఐఆర్‌సీటీసీ మనకు అందిస్తుంది. ఇండియన్‌ రైల్వే డేటా ప్రకారం 55శాతం రైల్వే ప్రయాణికులు టికెట్లను రిజర్వేషన్‌ చేయించుకుంటున్నారు. ఇప్పుడు రిజర్వేషన్‌ చేయించుకునే ప్రయాణికుల సంఖ్యను పెంచేందుకు కృషి చేస్తోంది. ఇందులో భాగంగా  నిరుద్యోగ యువత, అదనపు ఆదాయం కోసం ప్రయత్నిస్తున్నవారికి ఈ అవకాశం కల్పించింది. 

ఐఆర్‌సీటీసీలో టికెట‍్లు బుక్‌ చేస్తే వచ్చే ఆదాయం

ఐఆర్‌సీటీసీ ఏజెంట్‌గా నాన్‌ ఏసీ ట్రైన్‌ టికెట్ బుక్‌ చేసిన ప్రతి సారి రూ.20 కమిషన్‌ వస్తుంది

ఏసీ టికెట్లు బుక్‌ చేస్తే టికెట్‌ పై రూ.40 కమిషన్‌ వస్తుంది

అంతేకాదు మనీ రూ.2వేలు ట్రాన్స్‌శాక్షన్‌ పై 1శాతం కమీషన్‌ తో పాటు రూ.2వేలు ట్రాన్సాక్షన్‌ దాటితే గేట్‌వే ఛార్జీలను అదనంగా పొందవచ్చు. 

నెలలో అపరిమితంగా ట్రైన్‌ టికెట్లను బుక్‌ చేసుకోవచ్చు. ఒక్కో టికెట్‌ పై పక్కా కమిషన్‌ను పొందవచ్చు.

దీన్ని బట్టి నెలకు రూ.80వేలు డబ్బులు సంపాదించుకోవచ్చు. అంతకాకపోయినా నెలకు రూ.40 నుంచి రూ.50వేల వరకు రాబడి ఉంటుంది. 

ఆర్థరైజ్‌ ఐఆర్‌సీటీసీ ఏజెంట్‌గా పనిచేయాలంటే 

ఏంజెంట్‌గా పనిచేయాలనుకుంటే ఐఆర్‌సీటీసీకి ఏడాది రూ.3,999 అగ్రిమెంట్‌ చేయించుకోవాలి

రెండు సంవత్సరాలకు రూ.6,999 చెల్లించాలి. 

100 టికెట‍్లు బుక్‌ చేస్తే ఒక్కో టికెట్‌పై రూ.10 చెల్లించాలి

101 నుంచి 300టికెట్లు బుక్‌ చేస్తే 8రూపాయిలు చెల్లించాలి

300 టికెట్లు బుక్‌ చేస్తే ఒక్కో టికెట్‌ పై రూ.5 రూపాయిలు చెల్లించాల్సి ఉంటుంది

ఆర్థరైజ్‌ ఐఆర్‌సీటీసీ ఏజెంట్‌గా గుర్తింపు రావాలంటే 

ఆన్‌లైన్‌ లో రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలి

సంబంధిత శాఖ అధికారుల రిక్వైర్‌ మెంట్‌ను బట్టి అడ్రస్‌ ప్రూప్‌లను సబ్మిట్‌ చేయాల్సి ఉంది. సబ్మిట్‌ చేసిన వెంటనే మన ఐడీ వెరిఫికేషన్‌ జరిగి ఓటీపీ వస్తుంది. 

అనంతరం మీరు ఐఆర్‌సీటీసీ ఐడీతో ఎంటర్‌ అవ్వాలి. రిజిస్ట్రేషన్‌ కింద రూ1100 చెల్లించాలి

చెల్లించిన తరువాత మీకు ఆర్ధరైజ్‌ ఐఆర్‌సీటీసీ ఏజెంట్‌గా అనుమతి లభిస్తోంది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top