వాట్సాప్ స్టేటస్ వీడియోలు, ఫొటోలూ డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా?

How to Download WhatsApp Status Videos and Photos on Mobile - Sakshi

ప్రస్తుతం ప్రతి ఒక్కరి మొబైల్ ఫోన్ లో కచ్చితంగా వాట్సాప్ ఉంటుంది. ప్రతి వ్యక్తి తమ ఫీలింగ్స్ వ్యక్తపరచడానికి వాట్సాప్ స్టేటస్ లో వీడియోనో, ఫొటోనో పెడుతుంటారు. కొందరు తమకు నచ్చిన వీడియో లేదా ఫోటోలను వాట్సాప్ స్టేటస్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని ప్రయత్నిస్తారు. కానీ, ప్రస్తుతానికి డౌన్‌లోడ్ చేసుకోవాలంటే వాట్సాప్‌లో అలాంటి ఫీచర్ ఇంకా రాలేదు. కొన్ని సింపుల్ స్టెప్స్ ద్వారా అత్యంత తేలిగ్గా డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉంది. దీనికోసం క్రింద పేర్కొన్న స్టెప్స్ ఫాలో అవ్వండి. 

  • ఇప్పుడు వాట్సాప్ తెరచి, స్టేటస్‌లోకి వెళ్లండి.
  • మీరు ఏం డౌన్‌లోడ్ చెయ్యాలనుకుంటున్నారో దానిని ఓసారి పూర్తిగా చూడండి.
  • ఇప్పుడు మీ మొబైల్‌లోని ఫైల్ మేనేజర్ ఫోల్డర్ ఓపెన్ చెయ్యండి.
  • తర్వాత సెట్టింగ్స్‌లోకి వెళ్లి Show Hidden Files ఆప్షన్‌ను క్లిక్ చేయండి. 
  • ఇప్పుడు మళ్లీ వెనక్కి వచ్చి స్టోరేజ్‌లోకి వెళ్లి వాట్సాప్‌ ఆప్షన్‌ ఓపెన్ చేయండి.  
  • వాట్సాప్ ఫోల్డర్ కనిపించే మీడియా ఆప్షన్‌లో స్టేటస్(statuses) ఆప్షన్‌ను ఎంచుకోండి. 
  • అందులో వాట్సాప్ స్టేటస్‌లో చూసిన వీడియోలు, ఫొటోలూ ఉంటాయి. 
  • వాటిని కాపీ చేసి... వేరే ఫోల్డర్‌లో పేస్ట్ చేసుకోండి.

ఈ విధంగా మీరు వాట్సాప్ స్టేటస్‌లోని ఫొటోలూ, వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే, గూగుల్ ప్లే స్టోర్ కి వెళ్లి వాట్సాప్ స్టేటస్ డౌన్‌లోడ్ మేనేజర్ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని కూడా మీకు నచ్చిన వాటిని పొందవచ్చు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top