టెక్కు టమారం: ఇలాంటి పోర్టబుల్‌ డ్రైక్లీనర్‌ ఉంటేనా

How Does Work Portable Dry Cleaner - Sakshi

ఇలాంటి పోర్టబుల్‌ డ్రైక్లీనర్‌ ఉంటే, ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం కష్టమేమీ కాదు. దుస్తులను, గోడలను, గచ్చును, ఫ్యాన్లు, టీవీలు, కంప్యూటర్లు వంటి పరికరాలను ఇది చిటికెలో శుభ్రం చేసేస్తుంది. 

ఎలాంటి రసాయనాలతో పనిలేకుండానే, ఇది చక్కగా పనిచేస్తుంది. ఇందులో కాసిన్ని నీళ్లు నింపుకుని, ఆన్‌ చేసుకుంటే చాలు. దీని నుంచి వేగంగా వెలువడే వేడి ఆవిరి దుమ్ము, ధూళి మరకలను క్షణాల్లో తుడిచి పెట్టేస్తుంది. వాటిపై పేరుకున్న సూక్ష్మజీవులను సమూలంగా నాశనం చేస్తుంది. దుస్తులు, వస్తువులు చెమ్మదేరిపోవడం వల్ల వెలువడే దుర్వాసనను తొలగిస్తుంది. 

దీని నుంచి వెలువడే ఆవిరి ఉష్ణోగ్రత 160 డిగ్రీల సెల్సియస్‌ వరకు ఉండటంతో, ఇది ఉతికిన దుస్తులను నిమిషాల్లో ఆరబెట్టగలదు కూడా. అమెరికా, యూరోప్, ఆస్ట్రేలియా మార్కెట్‌లలో అందుబాటులో ఉన్న దీని ధర 109 డాలర్లు (రూ.8,671). 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top