
న్యూఢిల్లీ: హనీవెల్ టెక్నాలజీ సొల్యూషన్స్ (హెచ్‌టీఎస్), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ–హైదరాబాద్ (ఐఐటీ–హెచ్) భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి. హైదరాబాద్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ల్యాబ్ ఏర్పాటుతో పాటు కొత్త టెక్నాలజీలపై సంయుక్తంగా పరిశోధనలకు ఇది తోడ్పడుతుందని ఇరు సంస్థలు ఒక ప్రకటనలో తెలిపాయి. ల్యాబ్‌ను బుధవారం కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రారంభించారు. నూతన విద్యా విధానానికి అనుగుణంగా దేశంలోనే ఏఐలో పూర్తి స్థాయి బీటెక్ కోర్సు అందిస్తున్న తొలి విద్యా సంస్థ ఐఐటీ–హెచ్ అని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఈ ల్యాబ్‌ను ఐఐటీ–హెచ్ నిర్వహిస్తుంది. నిర్దిష్ట రంగాల్లోని వివిధ విభాగాల్లోని సిబ్బందికి అవసరమైన శిక్షణనిచ్చేందుకు, వర్క్‌షాప్‌ల నిర్వహణ, ఐఐటీ–హెచ్ విద్యార్థులు అలాగే హెచ్‌టీఎస్ ఉద్యోగులకు హ్యాకథాన్‌లు మొదలైన వాటి నిర్వహణకు రెండు సంస్థల మధ్య భాగస్వామ్య ఒప్పందం తోడ్పడనుంది.