LinkedIn: నియామకాలు పెరుగుతున్నాయ్, ఆ రంగాలే కీలకం

Hiring activity in India says LinkedIn Report - Sakshi

న్యూఢిల్లీ:నియామక కార్యకలాపాలు స్థిరమైన రికవరీలో ఉన్నాయని లింక్డ్‌ఇన్‌ ఇండియా తెలిపింది. కోవిడ్‌ ముందస్తు కాలం 2019తో పోలిస్తే 65 శాతం అధికంగా నమోదయ్యాయని వివరించింది. 

‘2021 ఏప్రిల్‌లో తిరోగమన వృద్ధి నమోదైంది. ఆ తర్వాతి నుంచి రికవరీ ప్రారంభమైంది. 2019తో పోలిస్తే ఈ ఏడాది మే చివరినాటికి 35 శాతం, జూన్‌ 42, జూలై చివరినాటికి 65 శాతం నియామకాలు అధికమయ్యాయి. ఒక సంవత్సరం స్తంభింపజేసిన తర్వాత ఐటీ, తయారీ, హార్డ్‌వేర్‌ వంటి పెద్ద రంగాలు నియామకాలను పెంచడం ప్రారంభించాయి. 

నియామకాలు క్రమంగా అధికం అవుతూనే ఉంటాయని అంచనా. ఉద్యోగాలు చేసేవారిలో కొత్తగా ప్రవేశించే వ్యక్తుల కంటే.. జాబ్‌ మారుతున్నవారే అధికం. ఆర్థిక వ్యవస్థ తిరిగి కోలుకోవడం కొనసాగుతున్నందున కొత్త, అభివృద్ధి చెందుతున్న ఉద్యోగాలలో అవకాశాలపై దృష్టిసారిస్తున్నారు. కోవిడ్‌ కారణంగా ఉద్యోగాలు మారే వ్యక్తులలో భారీ తగ్గుదల ఏర్పడింది.

చదవండి: మెరుగుపడుతున్న రాష్ట్రాల ఆదాయాలు!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top