సరికొత్త ఫీచర్లతో ప్రీమియం హీరో బైక్‌ వచ్చేస్తోంది: ఎప్పుడంటే?

Hero teases new motorcycle launch on June 14 - Sakshi

హిస్టారిక్‌ ప్రీమియం మోటార్‌సైకిల్ బ్రాండ్, కరిజ్మా ఎక్స్‌ఎంఆర్‌  బైక్‌ మళ్లీ ఎంట్రీ ఇస్తోందన్న ఊహాగానాలు, ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ దారు  హీరో మోటోకార్ప్ దాఖలు చేసిన ట్రేడ్‌మార్క్ దరఖాస్తుతో మరోసారి ఊపందు కున్నాయి. హీరో మోటోకార్ప్, రాబోయే మోటార్‌సైకిల్‌కి సంబంధించిన 14 సెకన్ల టీజర్ వీడియోను ఇటీవల విడుదల చేసింది. జూన్ 14న లాంచ్ డేట్ నిర్ధారించినప్పటికీ నిర్దిష్ట మోడల్ ఇంకా వెల్లడించలేదు. ఎక్స్‌ఎంఆర్‌ 210 లేదా ఎక్స్‌ట్రీమ్ 160R అప్‌డేటెడ్‌ వెర్షన్‌ అని కావచ్చని భావిస్తున్నారు.

హీరో మోటార్స్ అప్‌డేట్‌ చేసిన రీమోడల్‌ బైక్‌ ఎక్స్‌ట్రీమ్160R అప్‌డేటెడ్‌ వెర్షన్‌లో ఫీచర్లు, డిజైన్, ఇంజన్ స్పెసిఫికేషన్‌లు పెద్దగా మారకపోవచ్చని అంచనా. అప్‌డేటెడ్‌  ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, బ్లూటూత్ కనెక్టివిటీ, 5-స్పీడ్ గేర్‌బాక్స్ లాంటి అదనపు ఫీచర్లతో కీలక అప్‌గ్రేడ్స్‌నే అందిస్తోందట. కొత్త టూ-టోన్ బాడీ షేడ్స్‌ను కూడా పరిచయం చేసే అవకాశం ఉంది. అయితే, డ్యూయల్-ఛానల్ ABS సిస్టమ్‌తో వస్తుందా అనేది స్పష్టత లేదు. 163cc ఎయిర్-కూల్డ్ ఇంజిన్ 15 పవర్‌ను, 14 ఎన్‌ఎం గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. బైక్ ధర రూ. 1.30 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top