హెచ్‌డీఎఫ్‌సీ గోల్డెన్‌ కార్డ్‌: ప్రీమియం కస్టమర్లకు అదిరిపోయే ప్రయోజనాలు

HDFC Bank launches Regalia Gold Credit Card Rewards And Benefits - Sakshi

న్యూఢిల్లీ: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ రెగాలియా గోల్డ్‌ క్రెడిట్‌ కార్డ్‌ పేరుతో ఓ సూపర్‌ ప్రీమియం క్రెడిట్‌ కార్డ్‌ను విడుదల చేసింది. ప్రయాణ, లైఫ్‌స్టయిల్‌ ప్రయోజనాలు ఈ కార్డుతో పొందొచ్చని బ్యాంక్‌ ప్రకటించింది. ఎయిర్‌పోర్ట్‌ లాంజ్‌ యాక్సెస్‌ను ఉచితంగా అందిస్తోంది. ప్రీమియం మైల్‌ స్టోన్‌ ప్రయోజనాలు కూడా కార్డులో భాగం.

ఇదీ చదవండి: పెరగనున్న వడ్డీ రేట్లు.. మరో పావు శాతం రెపో పెంపు ఖాయం!

ఇది అందరికీ కాకుండా అధిక ఆదాయం ఉన్న వారికే బ్యాంక్‌ జారీ చేయనుంది. అంతర్జాతీయ ప్రయాణాలు, హోటళ్ల బుకింగ్‌లు, లైఫ్‌ స్టయిల్‌ కోసం ఖర్చు, కొనుగోళ్ల కోసం ప్రత్యేకంగా ఈ కార్డును తీసుకొచ్చింది. రిలయన్స్‌ డిజిటల్, మింత్రా, నైకాలో కొనుగోళ్లపై 5 రెట్ల రివార్డులు వస్తాయి. ప్రతి రూ.150 రిటైల్‌ వ్యయంపై 4 రివార్డు పాయింట్లు లభిస్తాయి. వార్షిక వ్యయం లక్ష్యాలను చేరుకున్న కస్టమర్లకు రెండు ఫ్లయిట్‌ టికెట్‌ వోచర్లు అందిస్తుంది.

ఇదీ చదవండి: ఇంట్లో ఎక్కువ డబ్బు పెట్టుకుంటున్నారా.. ఏమవుతుందో తెలుసా?

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top