1.14 లక్షల స్టార్టప్‌లు..

Govt recognises 114902 entities as startups as on Oct 31 - Sakshi

ఈ ఏడాది అక్టోబర్‌ 31 నాటికి 1,14,902 సంస్థలను స్టార్టప్‌లుగా గుర్తించినట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్‌ గోయల్‌ తెలిపారు. 2016 జనవరిలో ప్రవేశపెట్టిన స్టార్టప్‌ ఇండియా యాక్షన్‌ ప్లాన్‌ కింద ప్రయోజనాలను పొందడానికి అర్హత కలిగిన సంస్థలకు అవకాశం కలి్పంచినట్లు ఆయన పేర్కొన్నారు.

మరోవైపు, అమెరికా, హాంకాంగ్, చైనా వంటి ఎగుమతి దేశాల్లో డిమాండ్‌ మందగించడం, ముడి పదార్థాల ధరల పెరుగుదల వంటివి రత్నాభరణాల పరిశ్రమకు సవాళ్లుగా మారాయని వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్‌ చెప్పారు.  2022–23లో రత్నాభరణాల ఎగుమతులు అంతక్రితం ఏడాదిలో నమోదైన 39.27 బిలియన్‌ డాలర్లతో పోలిస్తే సుమారు 3 శాతం క్షీణించి 38.11 బిలియన్‌ డాలర్లకు పరిమితమైనట్లు వివరించారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top