రేపు ఏడో విడత బొగ్గు గనుల వేలం

Govt to launch 7th round of commercial auctions on 29 march - Sakshi

106 కోల్‌ బ్లాక్‌లు ఆఫర్‌

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఏడో విడత బొగ్గు గనులను ఈ నెల 29న వేలం వేయనుంది. వేలం ద్వారా 106 బొగ్గు గనులను ఆఫర్‌ చేయనుంది. ఆరో విడతలో వేలం వేసిన 28 బొగ్గు గనులకు సంబంధించి ఒప్పందాలపై అదే రోజు సంతకాలు చేయనున్నట్టు బొగ్గు మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

ఈ 28 బొగ్గు గనుల్లో గరిష్టంగా 74 మిలియన్‌ టన్నుల మేర వార్షిక బొగ్గు ఉత్పత్తి సాధ్యమవుతుందని పేర్కొంది. ఏటా వీటి నుంచి రూ.14,497 కోట్ల ఆదాయం వస్తుందని.. కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత లక్ష మందికి ఉపాధి లభిస్తుందని ప్రకటించింది. ఇక ఏడో విడత వేలానికి ఉంచే 106 బొగ్గు గనుల్లో 61 గనులు కొంత వరకు అన్వేషించినవి కాగా, 45 గనుల్లో అన్వేషణ పూర్తయినట్టు బొగ్గు శాఖ తెలిపింది. మొత్తం 106 గనుల్లో 95 నాన్‌ కోకింగ్‌ కోల్, ఒకటి కోకింగ్‌ కోల్, 10 లిగ్నైట్‌ గనులుగా వెల్లడించింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top