20 ఖాతాలను సమీక్షించండి.. బ్యాంకులకు ఆర్థిక శాఖ విజ్ఞప్తి | Govt Asks Psbs To Review Top Ibc Cases Every Month | Sakshi
Sakshi News home page

20 ఖాతాలను సమీక్షించండి.. బ్యాంకులకు ఆర్థిక శాఖ విజ్ఞప్తి

Dec 23 2023 7:34 AM | Updated on Dec 23 2023 8:25 AM

Govt Asks Psbs To Review Top Ibc Cases Every Month - Sakshi

న్యూఢిల్లీ: మొండి బకాయిల (ఎన్‌పీఏ) నిర్వహణలో భాగంగా ఇన్‌సాల్వెన్సీ– దివాలా కోడ్‌ కింద దాఖలైన టాప్‌ 20 ఖాతాలను నెలవారీగా పర్యవేక్షించాలని, సమీక్షించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్‌బీ) అధిపతులను కోరింది. పీఎస్‌బీ మేనేజింగ్‌ డైరెక్టర్లు, సీఈఓలతో జరిగిన సమావేశంలో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సెక్రటరీ వివేక్‌ జోషి మాట్లాడుతూ, నెలవారీగా టాప్‌ 20 దివాలా కేసులను సమీక్షించాలని కోరారు.

ఈ సమావేశంలో నేషనల్‌ అసెట్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఎన్‌ఏఆర్‌సీఎల్‌) పని తీరును కూడా సమీక్షించారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల మెజారిటీ వాటాతో ఎన్‌ఏఆర్‌సీఎల్‌ 2021లో ఏర్పాటయి న సంగతి తెలిసిందే.

ఇదీ చదవండి: రాష్ట్రాలకు రూ.72,961 కోట్లు విడుదల.. ఎందుకంటే..

కెనరా బ్యాంక్‌ స్పాన్సర్‌ బ్యాంక్‌గా ఉంది. సెక్యూరిటైజేషన్‌ అండ్‌ రీకన్‌స్ట్రక్షన్‌ ఆఫ్‌ ఫైనాన్షియల్‌ అసెట్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆఫ్‌ సెక్యూరిటీ ఇంట్రెస్ట్‌ యాక్ట్, 2002 కింద రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో అసెట్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కంపెనీగా రిజిస్టర్‌ అయ్యింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement