ఎల్‌ఐసీ ఐపీఓ దిశగా మరో అడుగు | Sakshi
Sakshi News home page

ఎల్‌ఐసీ ఐపీఓ దిశగా మరో అడుగు

Published Tue, Aug 25 2020 5:43 AM

Government Gets The Ball Rolling For LIC Landmark IPO - Sakshi

న్యూఢిల్లీ: ఎల్‌ఐసీ ఐపీఓ (ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) విషయంలో మరో అడుగు ముందుకుపడింది. ఐపీఓ సంబంధిత విషయాల్లో సలహాలు ఇవ్వడానికి (ప్రి–ఐపీఓ ట్రాన్సాక్షన్‌ అడ్వైజర్‌) రెండు సంస్థలను కేంద్రం ఎంపిక చేసిందని సమాచారం. ఎస్‌బీఐ క్యాపిటల్‌ మార్కెట్స్, డెలాయిట్‌ టచ్‌ తోమత్సు ఇండియా సంస్థల నియామకం దాదాపు ఖరారైందని సంబంధిత వర్గాలు తెలిపా యి. ఇక  ఎల్‌ఐసీ విలును మదింపు చేయడానికి ఆక్చూరియల్‌ సంస్థను ఎంపిక చేయాల్సి ఉంది. దీనికి సంబంధించి త్వరలోనే కేంద్రం దరఖాస్తులను ఆహ్వానించనున్నది.

ఐపీఓ ఇష్యూ సైజు రూ.80,000–90,000 కోట్లు!  
ఎల్‌ఐసీ విలువ రూ. 8–10 లక్షల కోట్ల మేర ఉంటుందని అంచనా. ఐపీఓలో భాగంగా 10 శాతం వాటాను విక్రయించే అవకాశాలున్నాయని, మొత్తం  మీద ఎల్‌ఐసీ ఐపీఓ ఇష్యూ సైజు రూ.80,000–90,000  కోట్ల రేంజ్‌లో ఉండొచ్చని భావిస్తున్నారు.  నిధుల కొరత సమస్యను అధిగమించడానికి  ఎల్‌ఐసీ ఐపీఓ నిధులను ఉపయోగించుకోవాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది.

ఎల్‌ఐసీ హౌసింగ్‌ లాభంలో 34 శాతం వృద్ధి
ముంబై: ఎల్‌ఐసీ అనుబంధ సంస్థ ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో మెరుగైన పనితీరు చూపించింది. లాభం 34 శాతం పెరిగి రూ.817 కోట్లుగా నమోదైంది. కేటాయింపులు తగ్గడం కలిసొచ్చింది. అంతక్రితం ఏడాది ఇదే కాలానికి సంస్థ లాభం రూ.610 కోట్లుగా ఉండడం గమనార్హం. మొండి బకాయిలకు కేటాయింపులు (ప్రొవిజనింగ్‌) రూ.56 కోట్లుగా ఉన్నాయి. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో కేటాయింపులు రూ.253 కోట్లుగా ఉన్నాయి. ఇక సంస్థ ఆదాయం రూ.4,807 కోట్ల నుంచి రూ.4,977 కోట్లకు వద్ధి చెందింది. నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) రూ.1,186 కోట్ల నుంచి రూ.1,220 కోట్లకు చేరుకుంది.

నికర వడ్డీ మార్జిన్‌ (నిధుల సమీకరణపై చేసిన ఖర్చును, ఆయా నిధులను రుణాలుగా ఇవ్వడం ద్వారా ఆర్జించిన రాబడి నుంచి మినహాయించగా) 2.41 శాతం నుంచి 2.31 శాతానికి పరిమితమైంది. జూన్‌ చివరికి మొత్తం రుణాల్లో 25 శాతం మేర మారటోరియం పరిధిలో ఉన్నట్టు సంస్థ తెలిపింది. దీన్ని మరింత లోతుగా చూస్తే రిటైల్‌ గహ రుణాల్లో 16శాతమే మారటోరియం పరిధిలో ఉండగా, ప్రాపర్టీ డెవలపర్లకు ఇచ్చిన రుణాల్లో 77 శాతం మారటోరియం పరిధిలో ఉండడం గమనార్హం. రుణాల పోర్ట్‌ ఫోలియో రూ.2,09,817 కోట్లకు పెరిగింది.
 

Advertisement
Advertisement