ఆధునిక ఫీచర్స్, కొత్త హంగులతో రానున్న గూగుల్ పిక్సెల్ 7ఏ.. వివరాలు

Google pixel 7a specifications design leaked - Sakshi

ఎప్పటికప్పుడు కొత్త మొబైల్స్ వాడకానికి అలవాటుపడ్డ జనం కోసం గూగుల్ మిడ్ రేంజ్‍లో 'పిక్సెల్ 7ఏ' విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. కంపెనీ ఈ ఏడాది మేలో జరిగే గూగుల్ ఐ/ఓ 2023 (Google I/O 2023) ఈవెంట్‍లో కంపెనీ దీనిని లాంచ్ చేయనుంది.

ఇప్పటికే అందుబాటులో ఉన్న గూగుల్ పిక్సెల్ 6ఏ కంటే కూడా 7ఏ చాలా అప్డేటెడ్ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ప్రాసెసర్ నుంచి కెమెరాల వరకు చాలా విభాగాల్లో పిక్సెల్ 7ఏ అప్‍గ్రేడ్‍ పొందినట్లు సమాచారం. ఈ మొబైల్ ఫోన్ 6.1 ఫుల్ హెచ్‍డీ+ 90హెర్ట్జ్ OLED డిస్‍ప్లే పొందుతుంది. అంతే కాకుండా గూగుల్ టెన్సార్ జీ2 ప్రాసెసర్ కూడా ఇందులో ఉంటుంది.

త్వరలో విడుదలకానున్న గూగుల్ పిక్సెల్ 7ఏ వెనుక 64 మెగాపిక్సెల్ సోనీ IMX787 ప్రైమరీ, 12 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఉంటాయని సమాచారం. అయితే కంపెనీ ఈ మొబైల్ ఫ్రంట్ కెమెరా గురించి ఎటువంటి సమాచారం వెల్లడించలేదు. ఇది వైర్‌లెస్ చార్జింగ్‍కు సపోర్ట్ చేసే అవకాశం ఉంది. అయితే ఛార్జింగ్ కెపాసిటీ గురించి తెలియాల్సి ఉంది.

(ఇదీ చదవండి: దెబ్బకు 17 కార్లు డిస్‌కంటిన్యూ: జాబితాలో ఉన్న కార్లు ఏవంటే?)

గూగుల్ పిక్సెల్ 7ఏ మొబైల్ ధరల గురించి కూడా కంపెనీ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే గత సంవత్సరం విడుదలైన 6ఏ ధర రూ. 30,000 కంటే తక్కువ. కావున కొత్త ఏ7 దీని కంటే కొంత ఎక్కువ ధర వద్ద విడుదలయ్యే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు :

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top