చాట్‌జీపీటీకి భారీ షాక్‌: గూగుల్‌ సీఈవో కీలక ప్రకటన

Google Announces ChatGPT Rival Bard Releases AI Service to Early Testers - Sakshi

సాక్షి,ముంబై: గూగుల్‌కి సవాల్‌గా దూసుకొచ్చిన చాట్‌జీపీటీకి చేదువార్త. టెక్ దిగ్గ‌జం మైక్రోసాఫ్ట్ భారీ పెట్టుబ‌డులతో శరవేగంగా వస్తున్న చాట్‌జీపీటీ ఓపెన్ఏఐకి చెక్‌ చెప్పేందుకు గూగుల్‌ సిద్ధ మవుతోంది.  చాట్‌జీపీటీకి పోటీగా సెర్చ్‌ ఇంజీన్‌ దిగ్గజం గూగుల్‌ సరికొత్త ఏఐ బేస్డ్ చాట్‌బాట్‌  ‘బార్డ్’ ను తీసుకొస్తోంది. దీనికి సంబంధించిన టెస్టింగ్‌ను కూడా మొదలు పెట్టింది. అతి త్వరలోనే దీన్ని అందుబాటులోకి  తీసుకురానుంది. 

వినియోగదారుల ఫీడ్‌బ్యాక్ కోసం ఈ ఏఐ సర్వీస్ బార్డ్‌ను రిలీజ్‌ ఓపెన్‌ చేస్తున్నామని, దీని తరువాత త్వరలోనే పబ్లిక్‌గా విడుదల చేస్తామని గూగుల్‌,ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ వెల్లడించారు. సోమవారం ఒక బ్లాగ్‌పోస్ట్‌లో ఈ విషయాన్ని ప్రకటించిన ఆయన రానున్న కొద్ది వారాల్లోనే పబ్లిక్‌గా విడుదల చేస్తామని తెలిపారు. (Valentine’s Day sale: ఐఫోన్‌14 సిరీస్‌ ఫోన్లపై భారీ తగ్గింపు)

అలాగే ఏఐ వ్యవస్థలలో ఒకటైన ఆంథ్రోపిక్‌లో గూగుల్ దాదాపు 400 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 3,299 కోట్లు) పెట్టుబడి పెడుతున్నట్టు  పిచాయ్‌ చెప్పారు. నిజానికి ప్రయోగాత్మక సంభాషణ కృత్రిమ మేధ‌తో కూడిన సర్వీస్ బార్డ్ ను రెండేళ్ల క్రితమే గూగుల్‌ ఆవిష్కరించింది. LaMDA (లాంగ్వేజ్ మోడల్ ఫర్ డైలాగ్ అప్లికేషన్స్) ద్వారా అందిస్తోందని పేర్కొన్నారు.తమ విశాలమైన భాషా మోడల్స్‌ ఇది గొప్ప పవర్‌ ఇంటిలిజెన్స్‌, క్రియేటివిటీ కలబోతగా ఉంటుందన్నారు.  (ఫిబ్రవరి సేల్స్‌: మారుతి బంపర్‌ ఆఫర్‌)

కాగా టిక్‌టాక్,ఇన్‌స్టాగ్రామ్‌లను అధిగమించి చరిత్రలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న యాప్‌గా చాట్‌జీపీటీ వార్తల్లో నిలిచింది. ఈ జనవరిలో దాదాపు 100 మిలియన్ల నెలవారీ క్రియాశీల వినియోగదారులను సాధించిన సంగతి  తెలిసిందే.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top