ఫిబ్రవరిసేల్స్‌: మారుతి బంపర్‌ ఆఫర్‌

Maruti Suzuki offers Discounts of up to Rs 50k on  Ignis Ciaz and Baleno models - Sakshi

సాక్షి, ముంబై: దేశీయ కార్ల తయారీదారు మారుతి సుజుకి ఇండియా తన కస్టమర్లకు భారీ ఆఫర్‌ ప్రకటించింది. మార్కెట్‌లో అమ్మకాలను పెంచుకునే క్రమంలో పలు మోడళ్ల కార్లపై  తగ్గింపును ప్రకటించింది. ఫిబ్రవరి నెలలో  బాలెనో, సియాజ్ , ఇగ్నిస్ వంటి   మోడల్‌ కార్లపై  నేరుగా నగదు తగ్గింపులతో పాటు, కార్పొరేట్ డిస్కౌంట్‌లు , ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ అందించింది. 

(ఇదీ చదవండి: టాటా మోటార్స్‌ గుడ్‌ న్యూస్‌, టాప్‌ మోడల్స్‌పై అదిరిపోయే ఆఫర్లు)

మారుతీ సుజుకి సియాజ్
హై-ఎండ్ సెడాన్. మారుతి సుజుకి సియాజ్ రూ.40,000 వరకు తగ్గింపును అందిస్తున్నారు. ఇందులో  రూ. 25,000 నగదు తగ్గింపు, రూ. 10,000 ఎక్స్చేంజ్ , రూ. 5,000 కార్పొరేట్ తగ్గింపు.  105 హార్స్‌పవర్‌ను ఉత్పత్తి చేసే 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్, 5-స్పీడ్ మాన్యువల్ లేదా 4-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ ప్రధాన ఫీచర్లు (Valentine’s Day sale: ఐఫోన్‌14 సిరీస్‌ ఫోన్లపై భారీ తగ్గింపు )

మారుతీ సుజుకి బాలెనో
హై-ఎండ్ హ్యాచ్‌బ్యాక్  మారుతి సుజుకి బాలెనో సీఎన్‌జీ మోడల్‌ కొనుగోలుపై రూ. 15,000 వరకు ఆదా చేయవచ్చు. బాలెనోలోని 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్,  90 హార్స్‌పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది 

మారుతీ సుజుకి ఇగ్నిస్
పలు చిన్న కార్లలో ఒకటైన మారుతి సుజుకి ఇగ్నిస్ పై గరిష్టంగా  రూ.50,000 వరకు తగ్గింపు అందుబాటులో ఉంది. ఇందులో రూ.25వేల వరకు  క్యాష్‌ డిస్కౌంట్‌.  మారుతి సుజుకి ఇగ్నిస్ 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో 83 హార్స్‌పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. 
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top