ఇంజనీర్లకు ఉబెర్‌ గుడ్‌ న్యూస్‌

good news! Uber hiring for 250 engineers in Bengaluru, Hyderabad - Sakshi

 250 ఇంజనీర్‌ఉద్యోగాలు

 హైదరాబాద్‌, బెంగళూరులు కేంద్రాల్లో నియామకాలు

సాక్షి, హైదరాబాద్‌: మంచి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న ఔత్సాహిక ఇంజినీర్లకు గుడ్‌ న్యూస్‌. క్యాబ్‌ అగ్రిగేటర్ ఉబెర్ బెంగళూరు, హైదరాబాద్‌లలో ఇంజనీర్లను నియమించుకుంటున్నట్లు బుధవారం ప్రకటించింది. దేశంలో తన ఇంజనీరింగ్ , ఉత్పత్తి కార్యకలాపాల పరిధిని విస్తరించే ప్రయత్నంలో 250 మంది ఇంజనీర్లను ఎంపిక చేయాలని భావిస్తున్నట్టు తెలిపింది.  తద్వారా రైడర్, డ్రైవర్ వృద్ధి, డెలివరీ, ఈట్స్, డిజిటల్ చెల్లింపులు, రిస్క్ అండ్‌ కప్లైన్స్‌, మౌలిక సదుపాయాలు, అడ్టెక్, డేటా, భద్రత , ఫైనాన్స్ టెక్నాలజీ  టీంను బలోపేతం చేయనున్నామని ఉబెర్ పేర్కొంది.

విస్తరణ ప్రణాళికల్లో భాగంగా మొబిలిటీ, డెలివరీని మరింత అందుబాటులోకి తెచ్చే యోచనలో ఉన్నట్లు కంపెనీ తెలిపింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్, బెంగళూరు టెక్ సెంటర్లలో కొత్తగా ఇంజనీర్లను నియమించుకుంటామని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా 10వేలకి పైగా నగరాల్లో రవాణాలో కీలకంగా మారాలని ఉబెర్ లక్ష్యంగా పెట్టుకున్నా మన్నారు. ఇందుకు హైదరాబాద్, బెంగళూరులోని తమ బృందాలు ప్రపంచ డిమాండ్‌కు అనుగుణంగా పనిచేస్తాయని తెలిపింది. ముఖ్యంగావివిధ పరిశ్రమ-మొదటి ఆవిష్కరణలకు మార్గదర్శకంగా ఉండనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మందికి సేవ చేసే  ప్రయత్నాలలో భాగంగా నిపుణులైన ఇంజనీర్లను నియమించుకుంటామని, ఈ బృందాలద్వారా అన్ని గ్లోబల్ మార్కెట్లలో సవాళ్లను అధిగమించాలని   భావిస్తున్నట్టు సంస్థ సీనియర్ ఇంజనీరింగ్ డైరెక్టర్ మణికందన్ తంగరత్నం  వెల్లడించారు.

చదవండి :  Petrol, diesel prices: పెట్రో బాంబు, రికార్డు ధర
వ్యాక్సినేషన్‌: టెస్లా కారు, ఇల్లు.. బహుమతుల బొనాంజా

 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top