వామ్మో.. పసిడి దడ! నేడు ఎంతలా ఎగిసిందంటే.. | Gold and Silver Price Today On 26th October 2024 | Sakshi
Sakshi News home page

వామ్మో.. పసిడి దడ! నేడు ఎంతలా ఎగిసిందంటే..

Oct 26 2024 12:20 PM | Updated on Oct 26 2024 12:35 PM

Gold and Silver Price Today On 26th October 2024

Gold Price Today: దేశంలో బంగారం ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. వరుసగా రెండో రోజూ దడ పుట్టించేలా ధరలు పెరిగాయి. దేశవ్యాప్తంగా పసిడి ధరలు  నేడు (అక్టోబర్‌ 26) భారీగా ఎగిశాయి. ఈరోజు ఎక్కడెక్కడ ఎంత మేర రేట్లు పెరిగాయన్నది ఇక్కడ తెలుసుకుందాం.

తెలుగు రాష్ట్రాలోని హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడ సహా వివిధ ప్రాంతాల్లో నేడు 22 క్యారెట్ల పసిడి తులం (10 గ్రాములు) ధర అమాంతం రూ.650 పెరిగి రూ.73,600 లకు చేరింది. 24 క్యారెట్ల బంగారం కూడా రూ.710 ఎగిసి రూ. 80,290 లను తాకింది. బెంగళూరు, చెన్నై, ముంబై  ప్రాంతాలలోనూ  ఇదేవిధంగా ధరలు భగ్గుమన్నాయి.

ఇదీ చదవండి: బంగారంపై పండుగ ఆఫర్లు

దేశ రాజధాని అయిన ఢిల్లిలో కూడా ఈరోజు బంగారం ధరలు భారీగా ఎగిశాయి. 22 క్యారెట్ల బంగారంపై రూ.650 పెరిగి రూ.73,750 లను తాకగా, 24 క్యారెట్ల బంగారం కూడా రూ.710 పెరిగి రూ.80,440 వద్దకు ఎగిసింది.

Silver Price Today: దేశంలో వెండి ధరలు శనివారం నిలకడగా ఉన్నాయి. క్రితం రోజున భారీగా కేజీపై రూ.3000 క్షీణించిన వెండి నేడు స్థిరంగా ఉంది. హైదరాబాద్‌లో ప్రస్తుతం కేజీ వెండి రూ.1,07,000 వద్ద కొనసాగుతోంది.

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)

Advertisement
 
Advertisement
Advertisement