తాజా బడ్జెట్ 2024-25లో బంగారం, వెండి, ప్లాటినం వంటి లోహాలపై దిగుబడి సుంకాన్ని తగ్గిస్తున్నట్లు చేసిన ప్రకటన తరువాత బంగారం ధరలు భారీగా పతనమయ్యాయి. అయితే బుధవారం (జూలై 24) పసిడి ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. ఒక్క చెన్నైలో మాత్రం మళ్లీ తగ్గాయి.
ఈ బడ్జెట్‌లో బంగారం, వెండి వస్తువులు, కడ్డీలపైన బేసిక్ కస్టమ్స్ డ్యూటీని 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గించారు. ప్లాటినం, పల్లాడియం, ఇరీడియం వంటి వాటిపై కూడా సుంకాన్ని 15.4 శాతం నుంచి 6 శాతానికి తగ్గించారు.
నేటి ధరలు ఇలా..
తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడలతో పాటు వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు )  రూ.64,950 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల బంగారం రూ. 70,860 వద్ద నిలిచింది. బెంగళూరు, ముంబైలలోనూ ఇవే ధరలు ఉన్నాయి.
ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.65,100 వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.71,010 వద్ద కొనసాగుతుండగా చెన్నైలో మాత్రం వరుసగా రెండో రోజు కూడా పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇక్కడ 22 క్యారెట్ల బంగారం రూ.600 తగ్గి రూ.64,900 లకు క్షీణించింది. 24 క్యారెట్ల బంగారం రూ.660 తగ్గి రూ.70,800 వద్దకు వచ్చింది.
మళ్లీ తగ్గిన వెండి
దేశవ్యాప్తంగా వెండి ధరలు ఈరోజు కూడా తగ్గాయి. క్రితం రోజున కేజీకి రూ.3,500 క్షీణించిన వెండి ధర నేడు రూ.500 మేర దిగొచ్చింది. హైదరాబాద్‌లో ప్రస్తుతం వెండి ధర కేజీ రూ.92,000 వద్దకు తరిగింది.
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
