
దేశవ్యాప్తంగా బంగారం ధరలు పెరుగుదల బాట పట్టాయి. గత మూడు రోజులుగా పసిడి ధరలు స్వల్పంగా పెరుగుతూ వస్తున్నాయి. శనివారం (జూలై 13) కూడా స్వర్ణం రేటు 10 గ్రాములకు రూ.10 చొప్పున పుంజుకుంది.
హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 24 క్యారెట్ల మేలిమి బంగారం తులం (10 గ్రాములు ) ధర రూ.10 ఎగిసింది. దీంతో రూ. 73,760 వద్దకు చేరింది. అలాగే 22 క్యారెట్ల ఆర్నమెంట్ బంగారం కూడా రూ.10 పెరిగి రూ.67,610 వద్ద ఉంది. బెంగళూరు, ముంబైలలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.10 పెరిగి రూ.67,760 వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.10 ఎగిసి రూ.73,910 వద్ద ఉన్నాయి. చెన్నైలో కూడా పసిడి ధరల్లో స్పల్ప పెరుగుదల కనిపించింది. ఇక్కడ 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.10 పెరిగి రూ.68,260 లకు, 24 క్యారెట్ల బంగారం రూ.10 ఎగిసి రూ.74,470 లకు చేరుకుంది.
వెండి ధరల్లో తగ్గుదల
దేశవ్యాప్తంగా నేడు వెండి ధరల్లో తగ్గుదల నమోదైంది. హైదరాబాద్‌లో వెండి కేజీకి రూ.100 చొప్పున తగ్గింది. దీంతో ప్రస్తుతం ఇక్కడ కేజీ వెండి ధర రూ.99,900 వద్ద కొనసాగుతోంది.
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)