మళ్ళీ పెరిగిన బంగారం, వెండి: కొత్త ధరలు ఇవే.. | Gold and Silver Price Today 12th August 2024 | Sakshi
Sakshi News home page

Gold and Silver Price: మళ్ళీ పెరిగిన బంగారం, వెండి: కొత్త ధరలు ఇవే..

Aug 12 2024 2:37 PM | Updated on Aug 12 2024 3:01 PM

Gold and Silver Price Today 12th August 2024

బంగారం ధరలు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు కూడా గరిష్టంగా తులం ధర రూ.270 పెరిగింది. దీంతో పసిడి ధరలలో స్వల్ప మార్పులు జరిగాయి. ఈ కథనంలో దేశ వ్యాప్తంగా ఈ రోజు (ఆగష్టు 12) గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయనేది వివరంగా తెలుసుకుందాం.

హైదరాబాద్, విజయవాడలలో మాత్రమే కాకుండా బెంగళూరు, ముంబై, గుంటూరు, ప్రొద్దుటూరు, వైజాగ్‌లలో కూడా నేడు 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 64700 కాగా.. 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ. 70580 వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు వరుసగా రూ. 250, రూ. 270 పెరిగింది.

తెలుగు రాష్ట్రాలలో మాదిరిగానే చెన్నైలో కూడా బంగారం ధరలు రూ. 250, రూ. 270 పెరిగింది. దీంతో ఇక్కడ 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 64700 కాగా, 24 క్యారెట్స్ తులం పసిడి ధర రూ. 70580 వద్దకు చేరాయి.

దేశ రాజధాని నగరం ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ. 64850 కాగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 70730 వద్ద ఉంది. దీన్ని బట్టి చూస్తే నిన్నటి ధరలకంటే కూడా ఈ రోజు ధరలు వరుసగా రూ. 250, రూ. 270 పెరిగిందని స్పష్టమవుతోంది. దేశంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఢిల్లీలో గోల్డ్ రేటు కొంత ఎక్కువగా ఉందని స్పష్టమవుతోంది.

వెండి ధరలు
బంగారం ధరలు పెరిగినప్పటికీ.. వెండి ధరలు కూడా కొంత తగ్గుముఖం పట్టాయి. ఆదివారం స్థిరంగా ఉన్న వెండి.. సోమవారం రూ. 600 తగ్గి, కేజీ సిల్వర్ ధర రూ. 82500లకు చేరింది. మారుతున్న పరిణామాలు చూస్తుంటే.. బంగారం వెండి ధరలు రాబోయే రోజుల్లో మరింత పెరిగే సూచనలు ఉన్నట్లు స్పష్టంగా అర్థమైపోతోంది.

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement