గ్లెన్‌మార్క్ లైఫ్ సైన్సెస్ ఐపీవోకు సై

ధరల శ్రేణి రూ. 695–720
ఈ నెల 27 నుంచి షురూ
న్యూఢిల్లీ: హెల్త్‌కేర్ కంపెనీ గ్లెన్‌మార్క్ లైఫ్ సైన్సెస్ పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఈ నెల 27న ప్రారంభంకానున్న ఐపీవోకు ధరల శ్రేణి రూ. 695–720గా కంపెనీ ప్రకటించింది. 29న ముగియనున్న ఇష్యూలో భాగంగా రూ. 1,060 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 63 లక్షల షేర్లను సైతం విక్రయానికి ఉంచనుంది. మాతృ సంస్థ గ్లెన్‌మార్క్ ఫార్మా వీటిని ఆఫర్ చేస్తోంది. తద్వారా కంపెనీ మొత్తం రూ. 1,514 కోట్లవరకూ సమకూర్చుకోవాలని ఆశిస్తోంది. ఐపీవో నిధులను ప్రమోటర్లు ప్రత్యేక కంపెనీగా విడదీస్తున్న ఏపీఐ బిజినెస్ కొనుగోలుతోపాటు, పెట్టుబడి వ్యయా లు తదితరాలకు వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో పేర్కొంది. లిస్టెడ్ హెల్త్‌కేర్ కంపెనీ గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్స్‌కు అనుబంధ సంస్థ అయిన గ్లెన్‌మార్క్ లైఫ్ సైన్సెస్ అధిక విలువగల ఏపీఐలను రూపొందిస్తోంది. ఈ నాన్‌కమోడిటైజ్‌డ్ ఏపీఐలను గుండె సంబంధిత, కేంద్ర నాడీమండల వ్యాధుల చికిత్సలో వినియోగిస్తారు. వీటితోపాటు జీర్ణాశయ వ్యాధులు, యాంటీఇన్‌ఫెక్టివ్స్ తదితర చికిత్సలో వినియోగించే ఏపీఐలను కూడా కంపెనీ తయారు చేస్తోంది.
మరిన్ని వార్తలు